10వేల కోట్లతో పూర్తయ్యే పోలవరం ప్రాజెక్టు.. కట్ చేస్తే 62 వేల కోట్లు..!

Pandrala Sravanthi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు అనేది రాష్ట్ర ప్రజల కలల ప్రాజెక్టు. అయితే దీని నిర్మాణానికి ఇప్పటికే ఎన్నో ప్రభుత్వాలు ముందడుగు వేసి విఫలమయ్యాయి. కొన్ని సంవత్సరాల నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ దశలోనే ఉంటూ, ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అనే విధంగా తయారైంది. టిడిపి కూటమి ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పూర్తి అంచనాలు బయటకు వచ్చాయి. ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి సంబంధించి ఎంత ఖర్చవుతుందనేది ఇప్పటికే నివేదికలు తయారు చేశారు అధికారులు. అయితే కేంద్ర ప్రభుత్వం తొలి దశలో  41.15 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలిపేందుకు వీలుగా పనులు చేపట్టడానికి 30,436.95 కోట్లు మంజూరు చేసింది. కానీ రెండవ దశకు వచ్చేసరికి 45.72 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలపడం కోసం  నిధులను కేటాయించాల్సి ఉంది. 


అయితే ఈ దశలో కూడా రూ:32,000 కోట్లు ఖర్చవుతోందని పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు ప్రాథమికంగా లెక్కలు వేసి నివేదిక సమర్పించారు. దీనికి సంబంధించి పూర్తి నివేదిక తయారు చేసి  కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపబోతున్నట్టు తెలుస్తోంది. మొదటి దశలో మంజూరైనటువంటి నిధులు రెండోదశ అంచనాలు మొత్తం కలిపి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి  రూ:62,436 కోట్లకు చేరనుంది. ఈ అంచనాలపై సమగ్ర స్పష్టత రావాల్సి ఉన్నది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో కేంద్ర జలశక్తిమంత్రి  సీఆర్ పాటిల్ ను కలిసిన సందర్భంగా  రెండో దశ నిధుల మంజూరు కోసం లేఖ కూడా సమర్పించినట్టు తెలుస్తోంది.


దీనిపై కేంద్రం స్పందిస్తే మాత్రం తప్పకుండా పోలవరం ప్రాజెక్టు  చంద్రబాబు హయాంలోనే పూర్తవుతుందని తెలుస్తోంది. మరి చూడాలి ఏపీ రాష్ట్ర ప్రజల కలల ప్రాజెక్టు ఈ ప్రభుత్వ హయాంలోనైనా పూర్తవుతుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.2005-2006 సంవత్సరం నాటి అంచనాల ప్రకారం చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 10,151.03 కోట్లు కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతున్న కొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతూ వస్తోంది. అలా ప్రస్తుతం నిర్మాణ వ్యయం అంచనాల ప్రకారం చూసుకుంటే 62,436 కోట్లకు చేరింది. అలా దాదాపు పది వేల కోట్లతో పూర్తయ్య పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కారణంగా 62 వేలకు నిర్మాణ వ్యయం పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: