ఏపీ: వారి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం..రూ.33వేలు కట్టాల్సిన పనిలేదు..?
ఈ క్రమంలోనే ఏపీ లారీ యాజమాన్యుల సంఘం ఈ విషయం పైన సమ్మెకు దిగింది. కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన ఈ టెస్టింగ్ ఫిట్నెస్ ఫీజులను వెంటనే తగ్గించాలంటూ కూడా డిమాండ్ గా చేశారు. ఈ పెంపు వల్ల చిన్న తరహా సరుకు యాజమాన్యాల పైన తీవ్రమైన ప్రభావం చూపుతుంది అంటూ తెలియజేస్తున్నారు. ఈ విషయం పైన రాష్ట్ర లారీ యాజమాన్యుల సంఘం ప్రధాన కార్యదర్శి అయిన ఈశ్వర రావు మాట్లాడుతూ ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్ళామని ఈ విషయాన్ని పరిశీలించి రవాణా శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు ఒక ఆదేశాన్ని జారీ చేశారంటూ తెలిపారు.
రవాణా వాహనాల ఫిట్నెస్ ఫీజులు పెంచుతూ కేంద్ర జాతీయ రహదారుల శాఖ జారీ చేసినటువంటి నోటిఫికేషన్ నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం మెమో జారీ చేసిందని గతంలో ఉన్న పాత ఫిట్నెస్ ఫీజులనే వసూలు చేయాలంటూ తెలిపింది. ఈ ఫిట్నెస్ ఫీజుల విషయంలో ఇతర రాష్ట్రాలు ఏం చేస్తున్నాయనే విషయాన్ని అధ్యయనం చేసి తగిన సూచనలు అందించాలని రవాణా శాఖ కమిషనర్ నివేదిక అందించాలంటు మెమో జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ నిర్ణయం పట్ల లారీ యాజమాన్యాల సంఘం ఆనందాన్ని తెలియజేసింది.