ఏపీ: జనసేనలోకి వెళ్లిన వైసీపీ నేత.. ఊహించని పరిస్థితులు..!

Divya
రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు పరిచయం చేయనవసరం లేదు. సీనియర్ పొలిటికల్ నేతగా పేరున్న బాలినేని ఒంగోలులో మంచిపట్టు ఉన్నది. వైయస్సార్ కుటుంబానికి దగ్గర బంధువు. వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ పైన అసంతృప్తితో ఉండేవారు. 2024 ఎన్నికలలో ఓడిపోయిన అనంతరం జనసేన పార్టీలోకి చేరారు. వైసీపీలో మంత్రిగా పనిచేసిన బాలినేని తనకు సరైన గుర్తింపు లభించలేదని అసంతృప్తితో ఉండేవారు. అయితే ఎన్నికల ముందు జనసేన పార్టీలోకి చేరాలనుకున్నప్పటికీ కొన్ని సమీకరణాలు సెట్ కాకపోవడంతో వెనకడుగు వేశారు.



2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీలోకి చాలా ఉత్సాహంగా చేరారు. బాలినేని జనసేన పార్టీలోకి చేరి ఇప్పటికీ ఏడాదిపైనే కావస్తూ ఉన్న పార్టీలో ఇమడలేకపోతున్నారనే విధంగా వినిపిస్తున్నాయి. అటు కూటమి లీడర్లు ,ఇటు వైసిపి కోవార్టు అంటూ ఈ నేతని టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒంగోలులో బాలిలేని పరిస్థితులు కూడా సహకరించలేదు. చాలామంది టీడీపీ నేతలు కూడా ఈయన చేరికను వ్యతిరేకించారు. ఎటువంటి కార్యక్రమాలు జరిగిన పిలవకపోవడమే కాకుండా ఫ్లెక్సీలలో ఈయన పోస్టర్లు కూడా కనిపించనివ్వలేదు. వీటన్నిటిని గమనించిన జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాలినేని పైన సాఫ్ట్ కార్నుతో ఉన్నట్లు వినిపిస్తున్నాయి.



వాటన్నిటిని తట్టుకొని నిలబడిన బాలినేనిని పవన్ కళ్యాణ్ అభినందించారు. బాలినేని పార్టీలోకి వెళ్లేటప్పుడు ఎమ్మెల్సీ పోస్ట్ ఇవ్వాలనుకున్నారట పవన్ కళ్యాణ్. నాగబాబును మండలికి పంపడంతో ఆ అవకాశం లేకుండా పోయింది. అలాగే వైసీపీ నేత జయ మంగళ వెంకటరమణ ఎమ్మెల్సీగా వైసీపీ పార్టీ నుంచి రాజీనామా చేసిన వాటిని ఇంకా ఆమోదించలేదు. ఒకవేళ కోర్టు వీటికి అనుమతిస్తే ఎమ్మెల్సీ స్థానం బాలినేని కి ఇవ్వడానికి జనసేన సిద్ధంగానే ఉన్నట్లు సమాచారం. ఇలా ఎటు చూసినా కూడా బాలినేనికి టైమ్ బాగోలేదని చర్చ ఇప్పుడు ఒంగోలులో వినిపిస్తోంది. వీటికి తోడు ఆయన అధికార పార్టీలో ఉన్నామనే ఫీలింగ్ కూడా కనిపించలేదని, గత వైసిపి పార్టీలో ఎలా ఇబ్బంది పడ్డారో ఇప్పుడు జనసేనలో కూడా అలాగే ఇబ్బందులు పడుతున్నారనే విధంగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: