నిరుద్యోగులు ఎగిరిగంతేసే వార్త.. ఏకంగా 22,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్..?

Divya
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలియజేస్తూ పలు రకాల ఉద్యోగాలను విడుదల చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉండే వివిధ రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ D ఉద్యోగాల భర్తీకి రైల్వే బోర్డు తాజాగా ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 22,000 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు RRB తన ప్రకటనలో తెలియజేసింది ఈ మేరకు ఒక షార్ట్ నోటీస్ కూడా విడుదల చేసింది. ఈ ఉద్యోగాలను 2026లో అప్లై చేసుకోవచ్చు.


ఇందులో ట్రాక్ మైంటైనర్ గ్రేడ్ 4, పాయింట్స్ మెన్, లోకో షెడ్, ట్రాక్ మిషన్ తదితర విభాగాలలో అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి . అయితే ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18000 నుంచి బేసిక్ శాలరీతో పాటుగా, ఇతర రైల్వే అలవెన్స్  కూడా లభిస్తాయి. ఈ ఉద్యోగాలకు పదవ తరగతి లేదా ఐటిఐ అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

జనవరి 21వ తేదీ 2026 నుంచి ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులకు చివరి తేదీ ఫిబ్రవరి 20-2026.


అభ్యర్థుల వయోపరిమితి:
జనవరి 1-2026 తేదీ నాటికి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య కలిగి ఉన్నవారు అర్హులు.


ఇక విద్యార్హత ,ఎంపిక విధానం ,అప్లికేషన్స్ ఫీజు వంటి వివరాలను నోటిఫికేషన్ విడుదలైన తరువాత అందులో పొందుపరచనున్నారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులకు ఆధార్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆధార్ లోని పేరు ,పుట్టిన తేదీ ,10వ తరగతి సర్టిఫికెట్ తో పాటుగా ఫోటో వంటి వివరాలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం అధికారిక రైల్వే వెబ్సైట్ ను సంప్రదించాలి. మరొకవైపు కేంద్ర బలగాల్లో 25 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పుడు ఆ వెంటనే రైల్వే ఉద్యోగాలకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడంతో నిరుద్యోగులు ఆనందపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: