ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజనుల జాతర అయినటువంటి మేడారం జాతరకి కోట్లాదిమంది భక్తులు తరలివస్తారు. మేడారం జాతర ఒక కుంభమేళాను తలపిస్తుంది.అయితే అలాంటి మేడారం జాతర ని ఈ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా మేడారం జాతరకు సంబంధించి ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. అయితే ఆ వీడియోలోని స్వస్తిక్ గుర్తు గురించి తాజాగా తెలంగాణలో వివాదం నెలకొన్న సంగతి మనకు తెలిసిందే. అయితే మేడారం ఆలయ నిర్మాణంకు సంబంధించిన వీడియోలో రివర్స్ స్వస్తిక్ గుర్తు ఉండడంతో చాలామంది హిందువులు మండిపడుతున్నారు. స్వస్తిక్ గుర్తుని హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు.
ఏదైనా పని ప్రారంభించే ముందు ఓం, స్వస్తిక్ వంటి గుర్తులను రాసి ప్రారంభిస్తారు. అలాగే హిందువులు స్వస్తిక్ గుర్తును ఆ గణేశుడితో పోలుస్తారు. అలాంటి స్వస్తిక్ గుర్తును మేడారం జాతరకు సంబంధించిన వీడియోలో రివర్స్ లో ఎలా చూపిస్తారు అని చాలామంది హిందువులు మండిపడుతున్నారు. అయితే ఈ వివాదం పై తాజాగా క్లారిటీ ఇచ్చింది మంత్రి సీతక్క. తాజాగా మంత్రి సీతక్క రివర్స్ స్వస్తిక్ గుర్తు గురించి మాట్లాడుతూ.. స్వస్తిక్ గుర్తు గురించి ఎవరు వివాదం చేయకండి.ఎందుకంటే మా గిరిజన సాంప్రదాయంలో రివర్స్ లో ఉన్న స్వస్తిక్ గుర్తుని పూజిస్తాము. చాలా శతాబ్దాలుగా రివర్స్ లో ఉన్న స్వస్తిక్ గుర్తు మా ఆచారంలో భాగమైంది..
దయచేసి ఎవరు దీన్ని వివాదం చేయవద్దు. దీన్ని ఇక్కడితో ఆపేయమని కోరుకుంటున్నాను అంటూ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. మేడారం ఆలయ నిర్మాణం లో భాగంగా విడుదల చేసిన వీడియోలో రివర్స్ స్వస్తిక్ గుర్తు గురించి హిందూ సంఘాలు పెద్ద ఎత్తున విమర్శలు చేయడంతో దీనిపై మంత్రి సీతక్క క్లారిటీ ఇవ్వడంతో కొద్ది వరకు విమర్శలు ఆగిపోయాయి. మేడారం జాతర వచ్చే ఏడాది జరగబోతుండడంతో మేడారం జాతర ఏర్పాట్లను మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు దగ్గరుండి పరిశీలించారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం జాతర వచ్చే ఏడాది అనగా 2026 జనవరి 26 నుండి 31 వరకు జరగబోతుంది.