హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: పెరిగిన జగన్ గ్రాఫ్..ఓడినా జనం గుండెల్లోనే..!

Pandrala Sravanthi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఎన్నికలు అనేవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఎక్కువ రోజులు పాలించింది. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి మరణంతో రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా డిఫరెంట్ గా మారిపోయాయి.. అక్కడ కాంగ్రెస్ స్థానాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.. ఇదే సమయంలో ఏపీలో టిడిపి మరియు వైఎస్ఆర్సిపి మధ్య ఎప్పుడు పోటీ ఉంటుంది.. 2019 ఎన్నికల్లో టిడిపిని ఓడించి జగన్ అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత 2024 ఎన్నికలకు వచ్చేసరికి జగన్ ను ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు అనేక ప్లాన్లు చేసి కూటమిగా ఏర్పడ్డాడు.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీ జనసేన మరియు బిజెపి, టిడిపి కలిసి ఒక కూటమిలా ఏర్పడి ఈసారి జగన్ ను ఎదుర్కొన్నారు.. చాలా నియోజకవర్గాల్లో కొద్దిపాటి ఓట్ల మెజారిటీతోనే ఈ కూటమి నేతలు గెలిచారు.. 


మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 సీట్లు పొంది కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది. ఈ విజయంతో జనసేన పార్టీ కూడా జాతీయ గుర్తింపు పొందడమే కాకుండా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాగలిగాడు.. కానీ జగన్ కు మాత్రం 11 సీట్లే వచ్చాయి.. ఇదిలా నడుస్తున్న సమయంలో  అసలు జగన్ ఓడిన తర్వాత ఆయన గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని టిడిపి కూటమి నేతలనుకున్నారు.. కానీ ఆయన ఓడిపోయినా జనాల గుండెల్లో మాత్రం కొలువై ఉన్నారు.. అలాంటి జగన్ ఎప్పుడు బయటకు వచ్చిన వేలాదిమంది జనాలు నిరాజనాలు పలుకుతున్నారు.. జగన్ పాలనే బాగుండేది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం కూటమి సర్కారులో అభివృద్ధి జరుగుతున్నా కాని కిందిస్థాయిలో జనసేన, టిడిపి, బిజెపి నేతల మధ్య  తరచూ గొడవలు జరుగుతున్నాయి.. దీంతో విసుగు చెందిన నేతలు జగన్ ఉన్నప్పుడే బాగుండేది.. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా పేద ప్రజల బాగు కోసం ఉండేదంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు..


అంతేకాదు జగన్ ఓడిపోయినా కానీ నైతికంగా గెలుపు ఆయనదే అంటూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వీరంతా విడివిడిగా పోటీ చేసి ఉంటే జగనే గెలిచేవారు. అంతా కూటమిగా ఏర్పడి జగన్ ను ఓడించారు. కానీ డైరెక్ట్ గా పోటీ చేసి ఉంటే జగన్ దే అఖండ విజయం అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ జగన్ ఓటమితో జనాల్లో ఆయన గ్రాఫ్ పెరిగింది తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. 2025లో ఆయన పేరు మరింత పై స్థాయికి చేరుకుంది. టిడిపి కూటమి నాయకులు ఎంత జగన్ ను విమర్శించాలి అనుకున్నా ఆయన పేరు చెడగొట్టాలి అనుకున్నా వాళ్ళ తరం కావడం లేదు. జగన్ జనాల్లోకి వచ్చారు అంటే జననిరాజనం పలుకుతున్నారు.దీంతో టిడిపి నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ప్రస్తుత పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది.. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ఓడినా కానీ ఆయన గ్రాఫ్ మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: