సీఎం చంద్రబాబు నాయుడు దశాబ్దాల కాలం నుంచి రాజకీయాలను శాసిస్తూ ఉన్నారు. తన మామ నందమూరి తారక రామారావు నుంచి రాజకీయాలను అలవాటు చేసుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పటికీ మొక్కవోని దీక్షతో టిడిపి పార్టీని ఏపీలో నడిపిస్తూ వస్తున్నారు. దేశంలోనే ఎక్కువసార్లు సీఎం అయినా వ్యక్తుల్లో చంద్రబాబు టాప్ ఫైవ్ లో ఉంటారు.. అలాంటి చంద్రబాబు కేవలం రాష్ట్ర రాజకీయాలు చేయడమే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పి మోడీ సర్కార్ కి వణుకు పుట్టించిన ఘనుడు అని చెప్పవచ్చు. ఆయన గెలుపుతో ఈసారి మోడీ సర్కార్ కూడా కేంద్రంలో నిలబడేలా చేశాడని చెప్పుకోవచ్చు. అలాంటి చంద్రబాబు మోడీకి ఎలాంటి సాయం అందించారు అనేది చూద్దాం..
ఏపీలో అద్భుతమైన విజయాన్ని సాధించినటువంటి చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఎన్డీఏ కూటమిలో కీలక వ్యక్తిగా మారారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించారని చెప్పవచ్చు. ఎన్డీఏ కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీగా టిడిపి విజయం సాధించడం, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిందని చెప్పవచ్చు. బిజెపి పార్టీ ఎక్కువ లోక్ సభ స్థానాలు సాధించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లు మాత్రం రాలేదు. మెజారిటీ మార్కు 272 కు ఇంకా 32 సీట్లు తక్కువ పడ్డాయి. దీంతో మిత్రపక్షాల సహకారం మోడీకి అనివార్యమైంది. దీంతో చంద్రబాబు మోడీకి సపోర్ట్ అందించి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారని చెప్పవచ్చు..
అంతేకాదు కేంద్రం మెడలు వంచి మరీ కేంద్రం నుండి రాష్ట్రానికి అనేక నిధులు తీసుకువస్తున్నారు. ప్రస్తుతం రాజధాని ఏర్పాటు, పరిశ్రమలు, కొత్త రైల్వే లైన్లు, విమానాశ్రయాలు ఇలా అనేక అభివృద్ధి పనులకు అత్యధికంగా నిధులు తీసుకువస్తూ ఆంధ్రప్రదేశ్ ను అద్భుతంగా డెవలప్ చేయడంలో ముందుకు వెళ్తున్నారని చెప్పవచ్చు.. 2025 లో చంద్రబాబుకు చాలా కలిసి వచ్చిందని, కేంద్రాన్ని ఆయన ఏం అడిగినా తప్పకుండా ఇచ్చారని చెప్పుకోవచ్చు.. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు కీలక వ్యక్తిగా మారి ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి బంగారు బాటలు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.