హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కన్నా మోడీ అటెన్షన్ గ్రాబ్ చేసిన లీడర్ ఇతడే..!
ఇటీవలి కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ కనిపించినా, ఆయన చంద్రబాబు నాయుడికన్నా, పవన్ కళ్యాణ్కన్నా ఎక్కువగా లోకేష్‌ను పలకరించడం, ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఒకప్పుడు లోకేష్‌ను టిడిపి లోపలి వాళ్లే మెచ్చుకునే పరిస్థితి ఉండేది. మిగతా రాజకీయ పార్టీల నాయకులు, విమర్శకులు మాత్రం ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు.కొంతకాలం వరకు లోకేష్‌ను “పప్పు” అంటూ ట్రోలింగ్ చేయడం, ఆయనకు రాజకీయ పరిజ్ఞానం లేదని, నాయకత్వ లక్షణాలు లేవని విమర్శించడం సాధారణంగా మారిపోయింది. కానీ ఆ విమర్శలన్నింటినీ ఆయన తన బలహీనతలుగా కాకుండా, ఒక పాఠంగా తీసుకున్నారు. తనలో ఉన్న నెగటివిటీని ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ, ప్రజల్లోకి వెళ్లి పనిచేయడం ప్రారంభించారు.
యువ నాయకుడిగా ప్రజల సమస్యలపై మాట్లాడటం, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం పెంచుకోవడం వంటి అంశాల్లో లోకేష్ స్పష్టమైన మార్పు చూపించారు. ఆ మార్పే నేడు ఆయనను మోడీ చేత ప్రశంసలు పొందే స్థాయికి తీసుకువచ్చింది.మోడీ అటెన్షన్ గ్రాబ్ చేయడం అనేది సాధారణ విషయం కాదు. అది కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు లాంటి సీనియర్ నాయకులు పక్కనే ఉన్నప్పటికీ, లోకేష్‌కు ప్రత్యేక గుర్తింపు రావడం అంటే ఆయన రాజకీయ ఎదుగుదల ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఒకే మాట అంటున్నారు —“ఇదే గతి కొనసాగితే, భవిష్యత్తులో నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక స్టార్ పొలిటిషియన్‌గా ఎదగడం ఖాయం.”అందుకే ఈ ఏడాది మొత్తం చూస్తే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకన్నా ప్రధాని మోడీ ప్రత్యేకంగా దృష్టి సారించిన నాయకుడిగా లోకేష్ పేరు వినిపిస్తుండటంపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.