హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: కలహాలు తీర్చిన వేళ.. మళ్లీ గుర్తుండే సందర్భం అదే!

Divya
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలలో గోరంగా ఓడిపోవడానికి ముఖ్య కారణాలలో చెల్లెలు షర్మిల ప్రభావం కూడా చాలానే ఉంది. ముఖ్యంగా ఆస్తి వ్యవహారాల వల్ల అన్నాచెల్లెళ్ల మధ్య గొడవలు వచ్చాయని , దీనివల్ల షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వీరి మధ్య విభేదాలు మరింత ఎక్కువగా వినిపించాయి.. వీటికి తోడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేసుకొని మరి ఎన్నోసార్లు ప్రస్తావించింది. ఆ తర్వాత వీరి మధ్య ఎలాంటి జన్మదిన శుభాకాంక్షలు కూడా చెప్పుకోవడం, రాఖీలు కట్టడం వంటివి నిలిచిపోయాయి. ఈ విషయం అటు వైయస్సార్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. కానీ ఈ ఏడాది మాత్రం కొంతమేరకు ఊరట కలిగించిందని చెప్పవచ్చు.



డిసెంబర్ 21న వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చాలామంది రాజకీయ నాయకులతో పాటు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం  పవన్ కళ్యాణ్ జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా జగన్ సోదరి అయిన షర్మిల కూడా తన అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీంతో అలా తెలపడంతో ఈ ఏడాది ఇది చిన్నపాటి ట్విస్ట్ అని చెప్పవచ్చు. అయితే ఈ ట్విట్ చెల్లెలుగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షరాలుగా షర్మిల వైసిపి అధ్యక్షుడు జగన్ గారికి అంటూ శుభాకాంక్షలు తెలియజేసింది. ఇందుకు జగన్ కూడా స్పందిస్తూ.. థాంక్యూ షర్మిలమ్మ అంటూ రిప్లై ఇచ్చారు. వీరిద్దరికి సంబంధించిన ట్విట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



రాబోయే రోజుల్లో కచ్చితంగా జగన్, షర్మిల (అన్నా చెల్లెలు) ఇద్దరు కూడా కలిసిపోయే అవకాశం ఉందని ఇప్పటికే చాలామంది నాయకులు కూడా తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. వీటిని చూస్తూ ఉంటే అవన్నీ నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ విషయం వైయస్ అభిమానులకు కాస్త ఊరట కలిగించేలా ఉందని చెప్పవచ్చు.  వైయస్ కుటుంబంలో ఈ కలహాలను తీర్చిన వేళ ఈ ఏడాది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: