హెరల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025:: రేవంత్ రెడ్డిని చూసి మిగతా సీఎం లు నేర్చుకోవాల్సింది ఏంటి..?
ముఖ్యంగా రేవంత్ రెడ్డి తనపై ఉన్న రాజకీయ ఒత్తిడులకు, పైస్థాయి అధికారుల ప్రభావానికి ఏమాత్రం లొంగకుండా నీతి, నిజాయితీ, ధైర్యంతో ప్రజల కోసం పనిచేస్తున్నారని అనేక సందర్భాల్లో నిరూపితమైందని ప్రజలు చెబుతున్నారు. ఈ విషయం అల్లు అర్జున్ – పుష్ప సినిమా అంశంలో మరింత స్పష్టంగా బయటపడిందని అనేవారు కూడా ఉన్నారు. ఆ సందర్భంలో జరిగిన పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎంత సీరియస్‌గా స్పందించారు, ఎంత న్యాయంగా వ్యవహరించారు, చట్టం ముందు అందరూ సమానమే అన్న సందేశాన్ని ఎలా బలంగా ఇచ్చారు అనే విషయాలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు.
అదేవిధంగా, ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే పనుల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందంజలో ఉందని అభిమానులు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌తో పాటు అనేక ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయిన సందర్భాల్లో, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కొన్ని గంటల్లోనే వాటర్ క్లియర్ చేయించి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నారని ప్రశంసిస్తున్నారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఫీల్డ్‌లో పనిచేసే పాలనకు ఉదాహరణగా నిలిచిందని అంటున్నారు.
అలాగే జూబ్లీహిల్స్ఎన్నికలు, రోడ్ల అభివృద్ధి, నగర సుందరీకరణ వంటి అంశాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి హుందాతనాన్ని చూపించారని అభిప్రాయపడుతున్నారు. చిన్నచిన్న విషయాలకైనా ప్రాధాన్యం ఇచ్చి, ప్రజలకు నాణ్యమైన సదుపాయాలు అందించాలనే దృష్టితో ముందుకెళ్లారని చెప్పుకుంటున్నారు.ముఖ్యంగా, తనను నమ్మి ఓటు వేసిన ప్రజలకు పూర్తి న్యాయం చేయాలన్న సంకల్పంతోనే సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని, కేవలం అధికారాన్ని కాపాడుకోవడం, మళ్లీ తానే సీఎం కావాలన్న రాజకీయ మోజులతో ఎలాంటి తప్పుడు పనులకు పాల్పడలేదని ఆయన అభిమానులు గర్వంగా చెబుతున్నారు. ప్రజల నమ్మకమే తనకు అసలైన బలం అన్న భావనతో ఆయన ముందుకు సాగుతున్నారని విశ్లేషిస్తున్నారు.
ఈ కారణాల వల్లే, రేవంత్ రెడ్డిని చూసి మిగతా రాష్ట్రాల సీఎంలు కూడా ప్రేరణ పొందితే, దేశం మొత్తానికి మేలు జరుగుతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. నిజాయితీగా, ధైర్యంగా, ప్రజల కోసం పనిచేసే నాయకత్వం ఉంటే రాజకీయాలపై ప్రజల నమ్మకం మరింత పెరుగుతుందని అంటున్నారు.ఇదే కారణంగా ఈ ఏడాది మొత్తం సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు, వీడియోలు, ఆయన తీసుకున్న నిర్ణయాలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికలపై ఆయనకు మద్దతుగా లక్షలాది పోస్టులు రావడం, ప్రశంసల వర్షం కురవడం ఈ ఏడాదికి ప్రత్యేక ఆకర్షణగా మారింది.
మొత్తానికి, 2025 ముగింపులో తెలంగాణ రాజకీయాలను తిరిగి చూసుకున్నప్పుడు, సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించడం, ఆయన పనితీరుపై జరుగుతున్న చర్చలు – ఇవన్నీ ఈ ఏడాది రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచాయని చెప్పవచ్చు.