క్రైస్తవుల విషయంలో బాబు రేవంత్ ఒకే బాట.. హిందువుల విషయంలో మాత్రం..?

Pandrala Sravanthi
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు కొనసాగుతున్నారు. వీరిద్దరిని గురు శిష్యులు అని కూడా అంటారు.దానికి కారణం రేవంత్ రెడ్డి చంద్రబాబు దగ్గరే రాజకీయం నేర్చుకున్నారు.ఆయన టిడిపిలో నుండే కాంగ్రెస్ లోకి వచ్చారు. అయితే అలాంటి రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరూ క్రైస్తవుల విషయంలో ఒకే మాట ఒకే బాటలో ప్రయాణిస్తున్నారంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు..దానికి కారణం తాజాగా క్రిస్మస్ వేడుకలకు ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు చేసిన పనే.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రపంచవ్యాప్తంగా హిందువుల కి సంబంధించిన ఎన్నో గుళ్ళు గోపురాలు ఉన్నాయి.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా హిందూ దేవాలయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు ప్రభుత్వ ఖజానా నుండి ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. కేవలం కొన్ని ప్రముఖ ఆలయాల నుండి వచ్చే డబ్బులను కార్పస్ ఫండ్ కిందకు తీసుకువచ్చి అందులోనుండి 20% డబ్బులు తీసుకొని ఆ డబ్బుల నుండే అర్చకులకు ఇస్తారు తప్పించి ప్రభుత్వ ఖజానాల నుండి 10 పైసలు కూడా ఇవ్వరు. 


హిందూ గుళ్ళల్లో అర్చకులకు ప్రభుత్వం నుండి డబ్బులు ఇవ్వరు కానీ ఇదే సందర్భంలో క్రైస్తవ మతంలోని పాస్టర్లకు, ముస్లిం మతంలోని మౌజమ్ లకు మాత్రం ప్రభుత్వ ఖజానా నుండి డబ్బులు ఇస్తారు . ఇదెక్కడి సెక్యులరిజం.. సెక్యులరిజం అంటే మత ప్రమేయం లేని రాజ్యం.. అయితే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిపాలన చేసే సమయంలో మత ప్రమేయం లేని రాజ్యం అని చెప్పుకు వస్తూ ఈ విధంగా ఒక మత అర్చకులకు ప్రభుత్వం నుండి డబ్బులు ఇస్తూ మరో మతానికి ఇవ్వకుండా ఉంటారా అనే అంశం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని ఇప్పటికే చాలామంది రాజకీయ విశ్లేషకులు పదేపదే చెప్పుకొచ్చారు. అయితే గతంలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్ పాస్టర్లకు డబ్బులు ఇచ్చినప్పుడు ఎవడబ్బా సొమ్మని వారికి డబ్బులు తగలేస్తున్నాడని ప్రతిపక్షాలు విమర్శించాయి. మరి ఇప్పుడు ఇటు చంద్రబాబు అటు రేవంత్ ఇద్దరు కలిసి  చేసింది ఏంటి.. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్రిస్మస్ వేడుకలకు ప్రభుత్వ ఖజానా నుండి డబ్బులు కేటాయించారు.


తెలంగాణలో క్రిస్మస్ వేడుకలకు 33 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటాయిస్తే.. ఆంధ్రాలో చంద్రబాబు క్రిస్మస్ వేడుకలకు ఏకంగా 50 కోట్లు కేటాయించారు. అలా ఏపీలో పాస్టర్లకి క్రిస్మస్ సందర్భంగా 60 వేల రూపాయలని తమ ఖాతాలో జమ చేశారు.నెలకి 5000 చొప్పున సంవత్సరానికి 60000 అని తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ కి, ఆరోగ్యశ్రీకి నిధులు విడుదల చేయడం లేదు కానీ పాస్టర్లకు ఏదో బాకీ ఉన్నట్లు నిధులు విడుదల చేశారు. అంతే కాదు 12 ఏళ్ల నుండి ఇవ్వడం లేదట. అందుకే ఇప్పుడు ఒక్కో పాస్టర్ కి 5000 చొప్పున సంవత్సరానికి 60,000 ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. అలా ఒక్కో పాస్టర్ కి సంవత్సరానికి 60 వేల చొప్పున క్రిస్మస్ ముందు రోజు ఖాతాలలో వేశారు.ఈ విషయాన్ని ఎలా చూడాలి? హిందువుల విషయంలో ఎందుకు ఇలా ఉండడం లేదు..ఇతర మతాల విషయంలో మాత్రం ప్రభుత్వం ఎందుకిలా స్పందిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు ఈ విషయంలో రేవంత్ బాబు ఇద్దరు ఒకే బాటలో నడుస్తున్నారని విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: