హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: మసకబారిన కేసీఆర్ పేరు.. గ్రాఫ్ అంతా తగ్గేనా?

Pandrala Sravanthi
తెలంగాణ రాష్ట్రం పేరు చెప్తే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది కేసీఆర్.. అలాంటి కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు.. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అవేర్నెస్ కల్పించి నిరాహార దీక్ష చేసి చివరికి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. అలాంటి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండు పర్యాయాలు సీఎంగా తన మానియా చూపించారు.. మొదటి సారి గెలిచినప్పుడు అనేక పథకాలు తీసుకువచ్చి  అదరహో అనిపించారు. కానీ రెండవసారి గెలిసిన తర్వాత కేసీఆర్ పాలన బాగానే అందించారు కానీ కింది స్థాయిలో ఉండే నాయకత్వం అంతా  కాస్త వీర్రవీగుతూ ప్రజల్లో మైనస్ అయ్యారు.. ఈ విధంగా మూడవ దశ ఎన్నికల్లో  బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించి కాంగ్రెస్ కు పట్టం కట్టారు.. అయితే కాంగ్రెస్ ని కూడా అంతగా అధికారంలోకి తీసుకువచ్చిన నాయకుడు ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి పేరు చెప్పుకోవచ్చు.. 


తెలంగాణలో ఏ మూలన చూసిన కేసీఆర్ చేసిన పనులే కనిపిస్తాయి. కేవలం తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశంలో కూడా తెలంగాణ అంటే కేసీఆర్ పేరే ముందుగా చెబుతారు. అలాంటి పేరు ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో మసకబారిపోతుంది.. కాంగ్రెస్ గెలిచిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమవ్వడం.. అలాగే ప్రజా సమస్యలపై మాట్లాడకపోవడం. ఏదో ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం లాంటివి చేస్తున్నారు.. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసిఆర్ ని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ ఆయన చేసిన తప్పులను ఆ పార్టీ చేసిన అరాచకాలను బయటపెడుతూ వస్తున్నారు.. ఈ విధంగా తెలంగాణలో ఎంతో హైలెట్ గా ఉన్నటువంటి కేసీఆర్ పేరు  ప్రస్తుతం చాలావరకు వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్పవచ్చు.


అయితే కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఇంకో లీడర్ ని ఎదగనివ్వలేదు.. దీనివల్ల కూడా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ తప్ప వేరే వాళ్ళు లేరు అనే స్థాయికి వచ్చింది.. కానీ కేసీఆర్ మాత్రం  జనాల్లో యాక్టివ్ గా లేకపోవడంతో ఆ పార్టీ పేరు కూడా జనాలకు దూరమైపోతుంది.. ఒకవేళ కేసీఆర్ ఓడినా గెలిచినా జనాల్లో ఉండి ఉంటే  కాంగ్రెస్ మానియా చాలావరకు తగ్గేది.. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ హైలెట్ అయ్యేది.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ చాలా వరకు సీట్లు గెలుచుకునేది.. కానీ బీఆర్ఎస్ అధినేత అలా చేయకుండా ఫామ్ హౌస్ కే పరిమితమై ఆయన పేరును ఆయనే మసకబారేలా చేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: