తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో అనేక పథకాలు అమలు అవుతున్నాయి.. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు,కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, 250 యూనిట్ ల ఉచిత కరెంట్ వంటివి ఎన్నో పథకాలు అమలు చేస్తూ పార్టీ ముందుకు వెళ్తోంది.. అలాంటి ఈ తరుణంలో రాష్ట్రం లో అధికార పార్టీ ఉన్నా కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కాస్త దెబ్బ పడదని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అంచనాలు తారుమారు చేసి చాలామంది అభ్యర్థులు ఓడిపోయారు.. మరి దీనికి కారణం ఏంటి అనే వివరాలు చూద్దాం.. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 11,14,17 తేదీల్లో మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎలక్షన్స్ జరిగాయి.
మొత్తం 12,728 సర్పంచ్ స్థానాలకు ఎలక్షన్స్ నిర్వహించారు.. ఇందులో 1207 స్థానాలు ఏకగ్రీవం అవ్వగా.. 11497 స్థానాలకు పోలింగ్ జరిగింది.. ఇందులో మొత్తం కాంగ్రెస్ 6,822 స్థానాలు గెలుచుకోగా, బీఆర్ఎస్ పార్టీ 3,518 స్థానాలు గెలుచుకుంది. అంతేకాకుండా బిజెపి 703చోట్ల గెలుపొందింది.. దీన్నిబట్టి చూస్తే కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు తప్పింది అని చెప్పవచ్చు. ఇంతవరకు పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేకున్నా కాంగ్రెస్ అందించింది. ఎన్నో పథకాలు తీసుకువచ్చినా కానీ కాంగ్రెస్ ని గ్రామీణ స్థాయి ప్రజలు ఆదరించలేదు.. అయితే దీనికి కారణం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అదే పార్టీ నుంచి ఒకరి నుంచి ముగ్గురు వరకు పోటీ చేశారు.. దీనివల్ల అధికార కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలిపోయి అదర్స్ పార్టీ వ్యక్తులు గెలుచుకుంటూ వచ్చారు..
ఈ విధంగా రేవంత్ రెడ్డి స్థానికంలో ఎంత చాణిక్యత పాటించినా కానీ అనుకున్న స్థాయిలో రిజల్ట్ అయితే రాలేకపోయిందని చెప్పుకోవచ్చు. 2025లో రేవంత్ రెడ్డి ని దెబ్బకొట్టిన ప్రధానమైనటువంటి ఇబ్బంది స్థానిక సంస్థల ఎన్నికలని చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ చాలా వరకు పుంజుకుందని చెప్పుకోవచ్చు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి బహిరంగ సభలు పెట్టి ప్రచారం చేసుకున్నారు. కానీ కేసీఆర్ బయటికి రాలేదు.ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్స్ సమయంలో కేసీఆర్ బయటకు వచ్చి నాలుగైదు బహిరంగ సభలు మెయిన్ మెయిన్ ప్రాంతాల్లో పెట్టి ఉంటే గనుక కచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరిన్ని స్థానాలు గెలుచుకునేది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.