కెసిఆర్ చేసిన పనితో రేవంత్ అలర్ట్ అయ్యాడా.. అందుకే అలా చేస్తున్నాడా..?

Pulgam Srinivas
తెలంగాణ రాజకీయ చరిత్రలో తనకంటూ ఒక అద్భుతమైన స్థానాన్ని ఏర్పరచుకున్న నాయకులలో చంద్రశేఖర్ రావు ఒకరు. ఈయన చాలా సంవత్సరాల క్రితం తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టాడు. కొన్ని సంవత్సరాల పాటు ఇతర పార్టీల్లో కొనసాగిన చంద్రశేఖర రావు ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించాలి అనే పట్టుదలతో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అనే పార్టీని స్థాపించాడు. ఈ పార్టీ స్థాపించిన తర్వాత కేసీఆర్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. కానీ ఎక్కడ వెనకడుగు వేయకుండా పార్టీని ముందుకు సాగించాడు. ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏకంగా ఆమరణ నిరాహార దీక్ష చేసి కేంద్రాన్ని తన వద్దకు రప్పించాడు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలలో కూడా టిఆర్ఎస్ పార్టీ భారీ విజయాలను అందుకుంది. కేసీఆర్ పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా పని చేశాడు. కొంత కాలం క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా అసెంబ్లీ స్థానాలు రాలేదు.


కాంగ్రెస్ పార్టీకి భారీ అసెంబ్లీ స్థానాలు రావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా కొనసాగుతున్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత కేసీఆర్ చాలా తక్కువ సమయాల్లో మాత్రమే బయటికి వచ్చాడు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ స్థాయిలో సర్పంచ్ స్థానాలు దక్కగా , ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి దక్కాయి. పంచాయతీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఓ ప్రెస్ మీట్ పెట్టాడు. అందులో చాలా దూకుడుగా మాట్లాడాడు. వెంటనే ఆ పార్టీ నాయకులకు కూడా మంచి ఉత్సాహం వచ్చింది. కెసిఆర్ స్పీచ్ తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఒక స్పీచ్ ఇచ్చాడు. అది దాదాపు కేసీఆర్ స్పీచ్ కు కౌంటర్ లాగానే ఉంది. దానితో చాలా మంది కేసీఆర్ ఇచ్చిన స్పీచ్ కు రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యాడు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: