ఏపీ: పవన్ కళ్యాణ్ సీఎం.. నవ్వు వెనుక మిస్టరీ..?
వైసిపి హయాంలో ఇప్పటం గ్రామంలో జనసేన కార్యకర్తల ఇళ్ల గోడలు కూల్చేశారని దీనితో పవన్ అక్కడికి వెళ్లి వారికి ధైర్యం చెప్పి , మళ్లీ వస్తానని చెప్పారు. అలా వృద్ధురాలి నాగమ్మ ఇల్లు కూడా దెబ్బతినడంతో ఆ తర్వాత ఆమె కొత్త ఇల్లు కూడా కట్టుకుంది. గతంలో హామీ ఇవ్వడంతో..నిన్నటి రోజున ఆమె ఇంటికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ అక్కడ నాగేశ్వరమ్మను హత్తుకొని తీవ్ర బాగోద్వేగానికి గురయ్యారు. ఇక నాగేశ్వరమ్మ కూడా పవన్ కళ్యాణ్ ను నువ్వు ఐదుసార్లు సీఎం కావాలి, నేను చూడాలి అంటూ కోరారు. అయితే ఈ విషయం పైన పవన్ కళ్యాణ్ నవ్వేసి సైలెంట్ గా ఉన్నారు. అంటే అవ్వననినా, అసాధ్యం అనినా లేకపోతే అదే అవుతుందనినా అనేదే పవన్ కళ్యాణ్ నవ్వు వెనుక ఉన్న మిస్టరీ.
అనంతరం నాగేశ్వరమ్మ చేసిన వ్యాఖ్యలకు పాదాభివందనం చేశారు పవన్ కళ్యాణ్. గతంలో కూడా ఎన్నికల సమయంలో ఆమె నువ్వు గెలిచిరా నానా అంటూ దీవించింది. అప్పుడు కూడా పాదాభివందనం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలకు కూడా మరొకసారి పాదాభివందనం చేయడంతో ఈ విషయం ఇప్పుడు రాజకీయాలలో వైరల్ గా మారింది.. నాగేశ్వరమ్మకు రూ .50వేల రూపాయలు, మనవడికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా అక్కడ గ్రామస్తులు పవన్ కళ్యాణ్ ను చూడడానికి పెద్ద ఎత్తున ఎగబడి వచ్చేశారు.