ఏపీ: వైసీపీలోకి రంగా కుమార్తె! జగన్ ట్వీట్ వైరల్..?

Divya
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, దివంగత కాపు నాయకుడు వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకు పలువురు అభిమానులతో పాటు ఆయన కుమారుడు రాధ, కూతురు ఆశా కిరణ్ తో పాటుగా పలు రాజకీయ పార్టీల అభిమానుల నివాళులు అర్పిస్తున్నారు. రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి మరి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇదే సందర్భంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వంగవీటి రంగాను గుర్తు చేసుకుంటూ ఒక ట్విట్ చేశారు.

"పేద ప్రజల సమస్యలను తన సమస్యగా భావించి ప్రజల కోసం గొంతుగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహనరంగా గారు.. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు" అంటూ వైయస్ జగన్ ట్విట్ చేశారు. అయితే గతంలో కూడా ఎన్నోసార్లు ఇలాంటివి చేసిన ఈసారి ఒక ప్రత్యేకత ఉందని రాజకీయాలలో వినిపిస్తోంది. వంగవీటి రంగా వారసుడుగా రాధాకృష్ణ గతంలో వైసీపీ పార్టీలో చేరారు. 2019 లో విజయవాడ తూర్పు లేదా బందర్ పార్లమెంటు నుంచి పోటీ చేయాలని జగన్ ఆప్షన్ ఇచ్చిన కానీ ఈ రెండిటిని వద్దని తనకు విజయవాడ సెంట్రల్ టికెట్ కావాలని పట్టు పట్టారు.ఆ టికెట్ సీనియర్ నేత మల్లాది విష్ణుకు కేటాయించినట్టుగా జగన్ తేల్చిచెప్పేశారు.


అనంతరం కొంతకాలం సైలెంట్ గా ఉన్న వంగవీటి రాధ ఆ తర్వాత వైసిపికి  గుడ్ బై చెప్పి టిడిపిలోకి చేరారు. ఆ పార్టీలో పదవులు ఇస్తారని భావించిన ఏది దక్కలేదు. వైసీపీలో ఖాళీ అయిన రాధా స్థానంలోకి ఆయన సోదరి ఆశా కిరణ్ చేరడానికి ప్రయత్నాలు చేస్తోందనే విధంగా వినిపించాయి. ఇప్పుడు తాజాగా ఆశా కిరణ్ రాజకీయాలలో యాక్టివ్గా అయ్యింది. కానీ రాజకీయ ఎంట్రీ ఉంటుంది కానీ ఏ పార్టీలో  చేరుతాననే విషయం మాత్రం చెప్పలేదు..సమయం వచ్చినప్పుడు చెబుతానని తెలిపింది. కానీ వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు వినిపిస్తోంది. ఇమే ఎంట్రీ కి కూడా జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా రాజకీయాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు సంకేతంగానే ఈరోజు జగన్ రంగా పైన చేసిన ట్వీట్ చర్చనీయంశంగా మారిందని వినిపిస్తోంది. మరి ఈ విషయంపై ఆశా కిరణ్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: