బిజెపిపై విజయ్ సైలెంట్.. పొత్తులకేనా..?
ఓటర్ల జాబితా సవరణ, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వంటి అంశాల పైన కూడా డైరెక్ట్ గా కేంద్రాన్ని విమర్శించకుండానే రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీని విమర్శిస్తే రాష్ట్రంలో డిఎంకెకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లు చీలే అవకాశం ఉందని భావిస్తున్నట్లు వినిపిస్తున్నాయి. అందుకే విజయ్ తన పూర్తి ఫోకస్ అధికార పార్టీ అయినా డీఎంకే పైన పెట్టారని తెలుస్తోంది. కానీ మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు మాత్రం 2026 అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే పార్టీ ఢీ కొట్టాలి అంటే టీవీకే పార్టీ ఒంటరిగా పోటీ చేయడం కష్టమని తెలుసు, బిజెపికి కూడా బలమైన పొత్తు కోసం ప్రయత్నిస్తోంది. ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోకపోయినా.. అన్నడీఎంకేతో కలిసి మూడో కూటమిగా ఏర్పాటు చేయడానికి విజయ్ సిద్ధమవుతున్నట్లుగా తెలియజేస్తున్నారు.
అందుకే కేంద్రంలో ఉండే బిజెపి పార్టీ పైన విమర్శలు చేయలేదని వినిపిస్తున్నాయి. గడిచిన కొన్ని నెలల క్రితం కరూర్ తొక్కిసలాట ఘటనలో కేంద్రం దర్యాప్తు సంస్థల పైన తీవ్రమైన ఒత్తిడి చేసిన విషయం వల్ల కూడా విజయ్ కు బిజెపిపై సాఫ్ట్ కార్న్ ఉన్నట్లుగా వినిపిస్తున్నాయి. అయితే విజయ్ అభిమానులు మాత్రం మరొక లాగా చెబుతున్నారు.. రాష్ట్రంలో డిఎంకే పార్టీ వ్యతిరేక ఓటు బ్యాంకు ను పూర్తిగా తన వైపు తిప్పుకోవడమే లక్ష్యం అని చెబుతున్నారు. ఇక విజయ్ సోషల్ మీడియా క్యాంపెయిన్ విషయానికి వస్తే ఎక్కువగా ప్రజా సమస్యలు, నిరుద్యోగం ,అవినీతి పైన స్పందిస్తున్నారని, వీటివల్ల యువత అండ లభిస్తుంది. బిజెపి పైన విమర్శలు తగ్గించడం వల్ల హిందుత్వ ఓటు బ్యాంకు కూడా కలిసొస్తుందనే ఆలోచనలో మౌనంగా ఉన్నారేమో అన్నట్టుగా చెబుతున్నారు. మరి విజయ్ మౌనం వెనుక 2026 ఎన్నికల సంబంధించి ప్లాన్ ఉంటుందంటూ తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయి.