తమిళనాడు రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి.. ఇప్పటికే అక్కడ డిఎంకె,అన్నాడీఎంకే పార్టీలు హోరా హోరిగా తలపడుతూ ఉన్నాయి. అందులో బిజెపి కూడా గట్టిగానే గెలుపు కోసం ప్రయత్నం చేస్తోంది. అలాంటి ఈ పార్టీల మధ్య హీరో విజయ్ దళపతి టీవీకె పార్టీ పేరుతో ప్రజల్లోకి వచ్చారు. అయితే ఆయన 2026 ఎలక్షన్స్ లో ఎలాగైనా విజయం సాధించి ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నాలు అత్యధికంగా చేస్తున్నారు. సమావేశాలు,బహిరంగ సభల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు.. అలాంటి విజయ్ దళపతి తాజాగా సరికొత్త ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఆ ప్లాన్ వర్కౌట్ అయితే మాత్రం ఆయన 2026 తమిళనాడు రాజకీయాల్లో సంచలనమే సృష్టిస్తారని చెప్పవచ్చు.. మరి ఆ వ్యూహం ఏంటి అనే వివరాలు చూద్దాం.. 2026 లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీవీకే పార్టీ పనిచేస్తుంది. ఓవైపు పార్టీని కింది స్థాయిలో బలంగా తీసుకువెళ్లడమే కాకుండా కూటమి ఏర్పాటుపై కసరత్తులు చేస్తోంది.
అయితే ఈ పార్టీలో కూటమి ఏర్పాటు కోసం సమన్వయకర్తగా సింగోట్టియన్ ను నియమించింది. బలమైన కూటమిని ఏర్పాటు చేయడానికి ముందుకు వెళ్తున్నారు. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో అనుభవం కలిగినటువంటి సింగోట్టియాన్ రాజకీయ పార్టీల నాయకులను సులభంగా కలుపుకొని వారితో ఎలాంటి చర్చలు అయినా చేయగలిగే శక్తి ఉందని విజయ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏ కూటమిలో కూడా లేనటువంటి ప్రధాన రాజకీయ పార్టీలను లక్ష్యంగా చేసుకొని వారితో మంతనాలు జరిపి టీవీకే తో పొత్తు కోసం వారిని అడగాలని చూస్తోంది. ఇదే తరుణంలో టిఎంకె, డిఎండికే ఏఎంఎంకె, పుదియ తమిళ గం పార్టీలతో టీవీకే మంతనాలకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా ఆయా పార్టీల నాయకులు టీటీవీ దినకరన్, ప్రేమలత, కృష్ణ స్వామి తదితరులతో టీవీకే నేతలు మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది.
మొత్తానికి కొత్త సంవత్సరం వచ్చేసరికి కొన్ని పార్టీలను టివీకేతో చేర్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత టీవీకే పార్టీలో గొప్ప మలుపు ఉంటుందని, అది తమిళనాడు రాజకీయాలని మార్చబోతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా విజయ్ అనుకున్నట్టు జరిగితే మాత్రం తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలనమే అని చెప్పవచ్చు.. అంతేకాదు విజయ్ ఇమేజ్ కి ఈ పార్టీలు తోడైతే 2026 ఎలక్షన్స్ లో తమిళనాడులో టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి చూడాలి విజయ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లోనే బయటకు వస్తుంది.