ఆ ఇద్దరి వల్ల కర్ణాటకలో కాంగ్రెస్ వీక్ అవుతుందా..?

Pulgam Srinivas
దేశ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్రను పోషించే రాష్ట్రాలలో కర్ణాటక రాష్ట్రం ఒకటి. ఈ ప్రాంతం నుండి అనేక పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. దానితో దేశ రాజకీయాల్లో ఈ రాష్ట్రం అత్యంత కీలక పాత్రను పోషిస్తూ ఉంటుంది. దానితో అనేక నేషనల్ పార్టీస్ ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిని పెడుతూ ఉంటారు. ఇకపోతే కొంత కాలం క్రితం కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఆధిక్యత వచ్చింది. దానితో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ నుండి ఇక్కడ ఎవరు ముఖ్య మంత్రి గా ఎన్నికవుతారు అనే ఆసక్తి చాలా పెద్ద ఎత్తున రేకెత్తింది.


ఆఖరుగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సిద్ధి రామయ్య ను ముఖ్యమంత్రి గా నియమించింది. ఇక శివ కుమార్ కూడా ముఖ్య మంత్రి పదవి కోసం ఎంతో పోరాడాడు. కానీ చివరకు కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సిద్ధి రామయ్య ను ముఖ్య మంత్రి గా నియమించింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో శివ కుమార్ , సిద్ధి రామయ్య ఇద్దరు కూడా బలమైన నేతలుగా కొనసాగుతున్నారు. దానితో రాబోయే ఎన్నికలలో మరో సారి కాంగ్రెస్ బలమైన మెజారిటీని కనుక సంపాదించుకున్నట్లయితే శివ కుమార్ , సిద్ధి రామయ్య ఇతరులు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే చర్చ ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నెలకొని ఉంది. 


ప్రస్తుతం సిద్ధి రామయ్య ముఖ్య మంత్రి గా కొనసాగుతున్నాడు కాబట్టి శివ కుమార్ ను నెక్స్ట్ ముఖ్య మంత్రి గా కాంగ్రెస్ అధిష్టానం నియమించే అవకాశం ఉంది అని కొంత మంది అభిప్రాయపడుతూ ఉంటే , మరి కొంత మంది మాత్రం సిద్ధి రామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి కారణంగా ఒక వేళ కాంగ్రెస్ పార్టీ మరోసారి గెలిచే అవకాశం ఉంటే ఆయననే మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా కూడా శివ కుమార్ , సిద్ధి రామయ్య ఇద్దరిలో ఎవరి ముఖ్యమంత్రి అవుతారు ... కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో నెక్స్ట్ ఎలక్షన్లలో ఎలాంటి రిసల్ట్ ను తెచ్చుకుంటుంది అనేది చాలా మంది లో ఎంతో ఉత్కంఠగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: