సెంటిమెంట్, స్ట్రాటజీ, సంక్రాంతి : నాని రీఎంట్రీపై హాట్ చర్చ..!
ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నాని ప్రధాన అనుచరులను టార్గెట్ చేస్తూ వరుసగా కేసులు నమోదయ్యాయి. నానికి అత్యంత సన్నిహితంగా ఉండే కేడర్‌తో కూడా ఆయన టచ్‌లో లేకపోవడంతో గుడివాడలో నాని కంచుకోటకు బీటలు పడ్డాయన్న ప్రచారం మొదలైంది. ఈ పరిస్థితిని అవకాశంగా మలుచుకున్న టీడీపీ గుడివాడలో రాజకీయంగా దూకుడు పెంచింది. ఎన్నారై అయిన వెనిగండ్ల రాము ఎమ్మెల్యేగా గెలిచి, రెండు దశాబ్దాల తర్వాత గుడివాడలో దక్కిన భారీ విజయాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాల్లో బిజీ అయ్యారు. వైసీపీ వైపు నుంచి పెద్దగా ప్రతిఘటన లేకపోవడం టీడీపీకి పూర్తిగా వన్‌సైడ్ పాలిటిక్స్ చేసే అవకాశం ఇచ్చిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నాని రాజకీయ భవిష్యత్‌పై, గుడివాడకు ఆయన తిరిగి వస్తారా లేదా అన్న చర్చ హాట్‌టాపిక్‌గా మారింది. నాని స్థానంలో కొత్త నాయకుడిని దింపాలా అన్న ఆలోచనలూ వైసీపీ అధినాయకత్వంలో జరిగాయని ప్రచారం సాగింది.
ఇదిలా ఉంటే, తాజాగా కొడాలి నాని తాను రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నానని స్పష్టం చేశారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొంటూ, హెల్త్ కారణాల వల్లే కొంతకాలం దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పారు. తాను ఎక్కడ ఆపానో అక్కడ నుంచే మొదలుపెడతానని, జగన్‌ను మళ్లీ సీఎం చేసేంతవరకు తన రాజకీయ పోరాటం ఆగదని గట్టిగా ప్రకటించారు. ఇప్పుడు గుడివాడలో అందరి చూపూ సంక్రాంతిపైనే ఉంది. ఏళ్ల తరబడి సంక్రాంతి సంబరాలను భారీగా నిర్వహించిన ఘనత నానిదే. మంత్రిగా ఉన్నప్పటికీ ఎడ్ల పందేలు వంటి కార్యక్రమాలతో గుడివాడను హోరెత్తించేవారు. అయితే 2025లో ఆయన గుడివాడకు రాలేదు. ఇక 2026 సంక్రాంతికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈసారి సంక్రాంతి పండుగకు నాని గుడివాడకు వస్తే, అదే ఆయన మలి రాజకీయ ఇన్నింగ్స్‌కు శ్రీకారం అవుతుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. నాని సంక్రాంతికి వస్తారా లేదా అన్నదే, ఆయన భవిష్యత్ రాజకీయాలపై స్పష్టత ఇచ్చే కీలక సంకేతంగా మారనుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.