ద్వార‌కాతిరుమ‌ల వెంక‌న్న సాక్షిగా హోరెత్తిన ముస్లిం నూరు / భాష దూదేకులు..!

RAMAKRISHNA S.S.
- ఏలూరు జిల్లా నూత‌న కార్య‌వ‌ర్గ స‌మావేశంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు

- ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల వారు సంఘటతంగా ముందుకు సాగాలని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సూచించారు. ఆదివారం ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం నూరు భాష/ దూదేకుల సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటరాజు మాట్లాడుతూ వెనుకబడిన కులాల వారు కడుపు కాల్చుకుని అయినా సంఘం బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ముస్లిం దూదేకుల నూర్ భాషా కులస్తులకు పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మరెక్కడ లేనివిధంగా ఐదువేల మందితో  ఇఫ్తార్ విందు ఇచ్చిన ఘనత గోపాలపురం నియోజక వర్గానికి దక్కుతుందన్నారు.


అన్ని వర్గాల ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని ఎమ్మెల్యే వెంకట్రాజు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా అధ్యక్షులుగా షేక్ ఇబ్రహీం, కార్యదర్శిగా షేక్ బాబు కాలిశా, కోశాధికారిగా మహమ్మద్ మౌలా, జిల్లా యూత్ అధ్యక్షులుగా మహమ్మద్ రఫీ, జిల్లా మహిళా అధ్యక్షురాలుగా షేక్ సతార్ బి,   ప్రధాన కార్యదర్శిగా షేక్ నాగూర్ బీబీ లతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యేతో పాటు పలువురు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ముస్లిం నూరు భాష దూదేకుల సంఘ చైర్మన్ నాగుల్ మీరా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయటంతో పాటు 100 కోట్ల రూపాయలు కార్పొరేషన్ కు ప్రకటించిందన్నారు.


తెలుగుదేశం ప్రభుత్వం నూర్ భాషా కులస్తులకు అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కే పీర్ మహమ్మద్, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ సుభాన్, ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ షేక్ ఇస్మాయిల్, రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ షేక్ మేరా సాహెబ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డి మస్తానమ్మ పలు జిల్లాల నుంచి వచ్చిన కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో యువకులు , మహిళలు, మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: