సీఆర్ రెడ్డి కళాశాల నుంచి అంతర్జాతీయ వేదికల వరకు " కామిక్ ఆనంద్ "

RAMAKRISHNA S.S.
ధ్వని హాస్యాపు గని " వందల గొంతుల వినోదయాత్ర –యువ మిమిక్రీ కళాకారుడు. కామిక్ ఆనంద్ " ధ్వని అనుకరణ (మిమిక్రీ) ఒక ప్రసిద్ధ కళ. మిమిక్రీ అనే పదం వినగానే అందరికీ నేరెళ్ల వేణు మాధవ్ గుర్తుకు వస్తారు. కామవరపుకోటకు చెందిన. ఆనంద్ స్వరూప్ అనే యువకుడు అలాంటి ప్రపంచ ప్రఖ్యాత కళాకారుడి ముందు ప్రదర్శన ఇచ్చి ఆయన ఆశీస్సులు పొందే భాగ్యం పొందాడు.


ఏలూరు జిల్లా కామవరపుకోటకు చెందిన ఆనంద్ స్వరూప్ ప్రేక్షకులకు కామిక్ ఆనంద్గా సుపరిచితుడు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన, చిన్ననాటి నుంచే కళపై అపూర్వమైన ఆసక్తిని పెంచుకున్నారు. చదువుతో పాటు కళను సమానంగా సాధనగా మలుచుకున్న ఆయన, 6వ తరగతిలోనే మిమిక్రీ కళను ప్రారంభించడం ఆయన జీవితంలో కీలక మలుపుగా మారింది.


అల్లిపల్లి బోర్డింగ్ నుంచే కళకు పునాది :
కామిక్ ఆనంద్ చదువుకున్న అల్లిపల్లి బోర్డింగ్ స్కూల్‌లో ఫాదర్ మరియాజోజి గారి దగ్గరే ఆయన కళకు బలమైన పునాది పడింది. విద్యతో పాటు ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన వాతావరణం అక్కడ లభించడంతో, స్టేజ్‌పై ధైర్యంగా నిలబడే ఆత్మవిశ్వాసం, ప్రదర్శనపై అవగాహన అప్పుడే అలవడిందని ఆయన గుర్తుచేసుకుంటారు. స్కూల్ కార్యక్రమాలు, సభలు, వార్షికోత్సవాలే తన తొలి వేదికలుగా మారాయని చెబుతారు.


సీఆర్‌ రెడ్డి కళాశాల - ప్రతిభకు రెక్కలు :
తదుపరి విద్యాభ్యాసం సీఆర్ రెడ్డి కళాశాలలో కొనసాగింది. ఈ కాలేజీ దశలోనే కామిక్ ఆనంద్‌లోని టాలెంట్ మరింత పదును పడింది. కాలేజీ వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు, యువజన వేదికలపై చేసిన ప్రదర్శనలు ఆయనను మిమిక్రీ రంగంలో మరింత ముందుకు నడిపించాయి. “సీఆర్ రెడ్డి కళాశాల నా టాలెంట్‌ను గుర్తించి, దాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లిన వేదిక” అని ఆయన చెబుతారు.


వందల గొంతులు – ఒకే కళాకారుడు :
కామిక్ ఆనంద్ ప్రత్యేకతల్లో ప్రధానమైనది కేవలం పది నిమిషాల్లోనే 100 వాయిస్‌లు చేసి భరత్ టాలెంట్ వరల్డ్ book రికార్డు సాధించాడు. నటులు, రాజకీయ నాయకులు, సాధారణ వ్యక్తుల స్వరాలు, హావభావాలు, మాటల శైలి—all in one stage. ఈ అరుదైన ప్రతిభే ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఈ విశిష్టతకు గుర్తింపుగా ఆయనకు ‘కళారత్న’ బిరుదు లభించింది.


మిమిక్రీకే కాదు… బహుముఖ ప్రతిభ :
మిమిక్రీతో పాటు
వెంట్రిలోక్విజం (బొమ్మలతో మాటల మాయ)
యాంకరింగ్
డబ్బింగ్ ఆర్టిస్ట్ గ
స్టాండ్‌అప్ కామెడీ
రంగాల్లోనూ ఆయన తన ప్రతిభను చాటుకున్నారు. ప్రేక్షకులను నేరుగా కలుపుకునే శైలి, సమయోచిత హాస్యం ఆయన ప్రదర్శనలకు ప్రధాన బలంగా మారాయి.
2000కి పైగా ప్రోగ్రామ్స్… దేశం దాటి విదేశాలకు
ఇప్పటి వరకు 2000కు పైగా స్టేజ్ ప్రోగ్రామ్స్ నిర్వహించిన కామిక్ ఆనంద్, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ వేదికల వరకు మాత్రమే కాకుండా విదేశాల్లో (అబ్రాడ్) కూడా ప్రోగ్రామ్స్ నిర్వహించి అక్కడి తెలుగు ప్రేక్షకులను నవ్విస్తూ మెప్పించారు. అంతర్జాతీయ వేదికలపై కూడా తెలుగు మిమిక్రీకి ఆదరణ ఉందని ఆయన ప్రదర్శనలు నిరూపించాయి.


టీవీ షోలతో విస్తృత గుర్తింపు :
పలు ప్రముఖ టెలివిజన్ ఛానళ్లలో ప్రసారమైన కార్యక్రమాల్లో పాల్గొని తన ప్రతిభను రాష్ట్రవ్యాప్తంగా పరిచయం చేసుకున్నారు. ఇటీవల ప్రసారమైన etv ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలో కామిక్ ఆనంద్ చేసిన ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఆయన మిమిక్రీ, కామెడీ భాగాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమే కాకుండా, షో నిర్వాహకులు, జడ్జీల ప్రశంసలు కూడా పొందాయి.


అవార్డులు - రివార్డులు - గుర్తింపులు :
కళారంగంలో చేసిన సేవలకు గాను కామిక్ ఆనంద్‌కు ఎన్నో అవార్డులు, రివార్డులు లభించాయి. పత్రికల్లో అనేకసార్లు ప్రత్యేక కథనాలకు కేంద్రబిందువయ్యారు.
కళే లక్ష్యం… నవ్వే సందేశం
వ్యవసాయ కుటుంబంలో పెరిగిన కష్టసాధ్య జీవితం, గురువుల ప్రోత్సాహం, విద్యాసంస్థల సహకారం తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని కామిక్ ఆనంద్ పేర్కొంటారు.
“నవ్వించడమే నా లక్ష్యం… ప్రేక్షకుల నవ్వే నా శక్తి” అన్నదే ఆయన కళా తత్వం.
డిసెంబర్ 28న జరుపుకునే మిమిక్రీ డే సందర్భంగా,బ్లైండ్.చిల్డ్రన్స్ స్కూల్స్ లో ఉచిత ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతుంది మిమిక్రీని ఒక కళగా మాత్రమే కాకుండా ఒక బాధ్యతగా భావిస్తూ, నిరంతరం ప్రేక్షకులను వినోదంతో అలరిస్తున్న కళాకారుడిగా కామిక్ ఆనంద్ నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: