2025: ఏపీ పోలీసులు వర్సెస్ ప్రభుత్వం.. !
శాంతి భద్రతలు: ఏ రాష్ట్రానికైనా ఇదిచాలా కీలకం. ఈ విషయంలో ఏపీ పోలీసులు.. 2025లో ఒకింత ఫర్వాలేదనే చెప్పాలి. సమాజంలో శాంతిని పెంపొందించే క్రమంలో ప్రభుత్వం ఉన్నతాధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. దీంతో నిరంతరం అల్లర్లతో ఇబ్బంది పడిన కొన్ని జిల్లాల్లో మార్పు అయితే కనిపించిం ది. అయితే.. ఇదేసమయంలో వివాదాల్లో చిక్కుకున్న పోలీసులు కూడా ఉన్నారు. కడప జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటించినప్పుడు జరిగిన ఘటన.. వ్యవహారం ఇబ్బంది పెట్టింది.
ఇక, ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలోనూ కొందరు వ్యక్తులు ఆయన సమావేశంలోకి చొరబడ్డార న్న విమర్శలు వచ్చాయి. అదేసమయంలో రాష్ట్రంలో అల్లర్లు, ఆందోళనలు.. విధ్వంసాలు జరగకుండా గట్టి మేలైన చర్యలే తీసుకున్నారు. ఇదిలావుంటే.. సైబర్ నేరాలను నిలువరించడంలో మాత్రం సక్సెస్ కాలేక పోయారు. అదేవిధంగా గంజాయి రవాణా, వినియోగం. సాగును నిరోధించేలా ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయినా.. పెద్దగా మార్పు అయితే కనిపించడం లేదు.
ఇవన్నీ ఒక లెక్క అయితే.. సామాన్యులకు పోలీసులు ఏమేరకు చేరువ అయ్యారన్నది కూడా ప్రధానం. ప్రస్తుతం వైసీపీ హయాంలో జరిగిన అక్రమ మద్యం కేసు, ఈ ఏడాది వెలుగు చూసిన తంబళ్ల పల్లె నకిలీ మద్యం కేసు, తిరుమల శ్రీవారి పరకామణి కేసు, నకిలీ నెయ్యి కేసు సహా.. ఇతర ప్రధాన కేసులను విచా రించేందుకే పోలీసులకు సమయం సరిపోని పరిస్థితి నెలకొంది. దీనికితోడు వీఐపీ పర్యటనలు పెరగడం తో వారి భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో సాధారణ ప్రజలకు పోలీసుల సేవతగ్గిపోయిందన్న విమర్శలు వున్నాయి. అయితే.. మొత్తంగా.. కొంత మేరకు శాంతి భద్రతలకు మాత్రం ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం.