న్యూ ఇయర్ గిఫ్ట్: రైతులకు కొత్త సంవత్సరం కానుక.. సంక్రాంతికి ముందే పంపిణీ!
రాజముద్ర: పుస్తకంపై ప్రభుత్వ అధికారిక చిహ్నం మాత్రమే ఉంటుంది. ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు ఉండవు.QR కోడ్: ప్రతి పాస్‌బుక్‌పై ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీన్ని స్కాన్ చేయడం ద్వారా రైతులు తమ భూమి వివరాలను ఆన్లైన్లో ఎప్పుడైనా సరిచూసుకోవచ్చు.రాజముద్ర సెక్యూరిటీ: నకిలీ పత్రాలకు తావు లేకుండా అత్యంత భద్రతా ప్రమాణాలతో వీటిని ముద్రించారు.ఈ మార్పు కోసం రైతులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం సుమారు రూ. 22.50 కోట్లు ఇందుకోసం కేటాయించింది.e-KYC తప్పనిసరి: పాస్‌బుక్ తీసుకునే సమయంలో రైతు వేలిముద్ర (Biometric) ద్వారా ఆన్లైన్ ధృవీకరణ చేయించుకోవాలి. వెబ్‌ల్యాండ్ లో ఉన్న వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎటువంటి తప్పులు లేవని నిర్ధారించుకున్నాకే పంపిణీ చేస్తారు.
ఒకవేళ చిన్నపాటి అక్షర దోషాలు ఉంటే, గ్రామసభలోనే తహసీల్దార్ల సమక్షంలో వాటిని వెంటనే సవరించేందుకు వీలు కల్పించారు.పాత పత్రాల సేకరణ: గత ప్రభుత్వం ఇచ్చిన 'జగనన్న భూహక్కు' పత్రాలను రైతుల నుండి వెనక్కి తీసుకుంటారు.రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో ఈ ప్రక్రియ అత్యంత పకడ్బందీగా సాగుతోంది. భూ వివాదాలను తగ్గించి, రైతులకు తమ భూమిపై పూర్తి భరోసా కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం.