ఆంధ్రప్రదేశ్ అసలు అప్పు ఎంత..?

Pulgam Srinivas
మన దేశంలో దాదాపు ఏ రాష్ట్రంలో అయినా సరే ఏదైనా పార్టీ అధికారం లోకి వచ్చి కొంత సమయం గడిచింది అంటే చాలు ప్రతిపక్ష పార్టీలు ప్రస్తుత పార్టీ అన్ని కోట్ల అప్పు చేస్తుంది ..? ఎన్ని కోట్ల అప్పు చేసింది. అందుకే ప్రజలకు అలాంటి స్కీములను అమలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఉబిలో దించేస్తున్నారు. ఇలా అప్పులు చేస్తూ పోతా ఉంటే ఆ తర్వాత రాష్ట్రం నడపడం కష్టం అవుతుంది. ఆ తర్వాత వాటికి వడ్డీలు కట్టడానికే రాష్ట్రం మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది అనే ప్రచారాలను చేస్తూ ఉంటారు. ఇక అధికారం లో ఉన్న పార్టీలు మేము కొత్తగా అప్పులు ప్రజాభివృద్ధి కోసం చేయడం లేదు. గత ప్రభుత్వాలు అనేక అప్పులను చేశాయి. వాటి ద్వారా రాష్ట్రం చాలా నష్టపోయింది. పాత అప్పులకు వడ్డీలు కడుతూ రాష్ట్రాన్ని నడపడం కష్టం అవుతుంది. దాని ద్వారా కొంత అప్పులు చేస్తున్నాము అని కొన్ని పార్టీలు చెబుతూ వస్తాయి. ఏదేమైనా కూడా అప్పుల గురించి జనాలకు సరైన లెక్కలు పెద్దగా తెలియవు. ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం వల్ల జనాలు ఏది నమ్మాలో కూడా సరిగ్గా అర్థం కాదు.


ఇకపోతే ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన అప్పుల గురించి కూడా అనేక వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. 
గతంలో వై సి పి పార్టీ అధికారం లో ఉన్న సమయం లో ఇతర పార్టీలు వై సి పి పార్టీ భారీ ఎత్తున అప్పులు చేస్తూ వస్తోంది. దానితో రాష్ట్రం అప్పుల ఊబిలో ఇరుక్కుపోతుంది అని అనేక మంది నాయకులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితం జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం , జనసేన , బి జె పి పార్టీ లు కలిసి పోటీ చేశాయి. ఈ కూటమి అద్భుతమైన స్థాయిలో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక ప్రస్తుతం వై సీ పీ పార్టీ వారు కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున అప్పులు చేస్తూ వస్తుంది అని ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు పోయిన సంవత్సరం లక్ష కోట్లు , ఈ సంవత్సరం 70 వేల కోట్ల వరకు అప్పు తీసుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. తాజాగా వై సి పి పార్టీ వారు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 లక్షల 93 వేల కోట్ల అప్పులు తీసుకున్నట్లు ప్రొజెక్ట్ చేస్తుంది. దీనితో ప్రజలు ఏది నమ్మాలో తెలియక సతమతం అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: