కండోమ్‌లపై పన్ను.. జనాభా పెంచేందుకు చైనా వింత నిర్ణయం?

Chakravarthi Kalyan
చైనా దేశం తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత కొన్ని సంవత్సరాలుగా జననాల రేటు గణనీయంగా తగ్గిపోవడంతో దేశంలో వృద్ధాప్య జనాభా పెరుగుతోంది. శ్రమ శక్తి తగ్గిపోవడం వల్ల ఆర్థిక వృద్ధికి ముప్పు ఏర్పడుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి చైనా ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది. ఇప్పుడు గర్భనిరోధక సాధనాలు కండోమ్‌లు ఔషధాలపై పన్ను విధించడం ద్వారా జననాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. విలువ ఆధారిత పన్ను చట్టం సవరణల ద్వారా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమలులోకి వచ్చిన ఈ చర్య వల్ల కండోమ్‌ల ధరలు పెరిగే అవకాశం ఉంది.

ఈ పన్ను ద్వారా గర్భనిరోధకాల వినియోగం తగ్గి జననాలు పెరుగుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.చైనాలో జనాభా తగ్గుదల గణాంకాలు భయానకంగా ఉన్నాయి. 2023లో జననాల సంఖ్య గణనీయంగా తగ్గి దేశంలో మొదటిసారి జనాభా తగ్గుదల రికార్డు అయింది. ఒక పిల్ల సిద్ధాంతం తర్వాత రెండు పిల్లలు మూడు పిల్లల విధానాలు ప్రవేశపెట్టినప్పటికీ ప్రజలు పెళ్లి పిల్లలు కలిగి ఉండటానికి ఆసక్తి చూపడం లేదు.

ఆర్థిక ఒత్తిళ్లు ఉద్యోగాల లేమి ఖరీదైన జీవన వ్యవస్థలు యువతను పిల్లలు కలిగి ఉండటానికి వెనక్కి తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గర్భనిరోధక సాధనాలపై 13 శాతం పన్ను విధించడం ద్వారా వినియోగాన్ని తగ్గించాలని భావిస్తోంది. ఈ చర్య వల్ల కండోమ్‌లు ఇతర గర్భనిరోధకాలు ధరలు పెరిగి ప్రజలు తక్కువగా ఉపయోగించే అవకాశం ఉంది. చైనా ఇంతకు ముందు కూడా జననాలను పెంచడానికి వివిధ ప్రోత్సాహకాలు అందించింది.ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది.


9490520108..  వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్యలు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్రజ‌ల స‌మ‌స్యలు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్యక్తిగ‌త స‌మ‌స్యలు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: