జనసేన: తెలంగాణలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం..?

Divya
జనసేన పార్టీ అధినేత ,ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు, మరొకవైపు రాజకీయాలలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల (శనివారం)జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేకమైన పూజలు చేయించి అందులో పాల్గొన్నారు. భక్తుల కోసం అక్కడ 96 గదుల ధర్మశాలలు ,దీక్ష విరమణ మందిరాలను కూడా శంకుస్థాపన చేశారు. ఇందుకోసం భక్తుల విరాళాల నుంచి రూ.35.19 కోట్ల రూపాయల సమకూర్చినట్లుగా అధికారులు తెలియజేశారు.



అనంతరం తెలంగాణలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలలో గెలుపు ఓటములు అనేవి సహజంగానే ఉంటాయని అయితే పోటీ చేయడం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ తెలియజేశారు పవన్ కళ్యాణ్. అంజన్న సన్నిధి తనని ఎన్నోసార్లు కాపాడిందని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. కష్టకాలంలో ఆధ్యాత్మిక బలం కూడా తనకు అండగా నిలిచిందని తెలిపారు. ఓటమికి భయపడకుండా పోటీ చేసేలా జనసేన పార్టీ బలోపేతం కావాలని సూచనలు ఇచ్చారు. ఎప్పుడైతే పోటీ పడతామో అప్పుడే అనుభవం వస్తుంది.ప్రజల మధ్య ఉండగలమని తెలియజేశారు. తనకు వ్యక్తిగతంగా ఎవరూ కూడా శత్రువులు కాదంటూ తెలియజేశారు పవన్ కళ్యాణ్.



తన రాజకీయ జీవితంలో పోరాట పటిమతో పాటు తెగింపు అనేవి తెలంగాణ నుంచి వచ్చాయని తెలియజేశారు. తమ పోరాటం వ్యక్తులపైన కాదని, పాలసీ ప్రకారమే జరుగుతుందని తెలియజేశారు. సరైన విధానాల కోసం ప్రజా ప్రయోజనాల కోసమే రాజకీయాలలో పోరాటం చేస్తూ వచ్చానని ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ నిలబడుతుందని జనసైనికులు కూడా నిలబడాలని సూచించారు పవన్ కళ్యాణ్. ప్రజల మధ్య ఉండి వారి యొక్క సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రతి జనసైనికుడికి ఉందని తెలిపారు. 100 మైళ్ళ ప్రయాణం కూడా కేవలం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది జనసేన ప్రయాణం ఇప్పుడు చాలా బలంగా మొదలైందని, ముందున్న లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: