పవన్ పవర్.. తెలంగాణలో కూడా తగ్గేదేలే.!

Pandrala Sravanthi
సాధారణంగా ఒక సినిమా ఆర్టిస్ట్ ఏదైనా కొత్త ప్లేస్ కు వెళ్తే జనాలు ఎగబడి చూస్తారు.. అందులో ఎంతో ఫేమస్ అయి రాజకీయాల్లో కూడా రాటుతెలినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్.. ఈయన ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్తే జనాలు అభిమానులు ఊరుకుంటారా.. సినీ సెలబ్రిటీలు ఎక్కడైనా కనిపిస్తే చాలు జనాలు చూడడానికి ఎగబడతారు.. అలాంటి స్టార్ లలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు.. అయితే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్నా కానీ తెలంగాణ దేవుళ్లను ఎక్కువగా పూజిస్తారు.. ముఖ్యంగా కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే ఆయనకు ఎంతో ప్రీతిపాత్రం.. శనివారం కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనాన్ని అట్టహాసంగా చేసుకున్నారు..


 ప్రభుత్వ ప్రోటో కాల్ నడుమ ఆంజనేయ స్వామి దర్శనం పూర్తయ్యింది.. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కొండగట్టు దగ్గరికి చేరుకున్నాడో ఆయనకు అడుగడుగునా జననీరాజనం పలికారు.. అభిమానులు సంతోషంతో కేకలేశారు.. ఆయన ఏపీ రాజకీయాల్లోకి వచ్చి ఇన్ని రోజులైనా కానీ తెలంగాణలో మాత్రం ఏమాత్రం అభిమానం తగ్గలేదు.. పవన్ తో సెల్ఫీ దిగేందుకు కేవలం అభిమానులే కాకుండా అధికారులు కూడా ఎగబడిపోయారు.. చివరికి పవన్ కళ్యాణ్ తన వాహనంపై ఎక్కి అందరికీ అభివాదం చేస్తూ సంతోషపెట్టారు..


చివరికి ఆయన అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ  కొండగట్టు ఆంజనేయస్వామి నా ప్రాణాలను కాపాడాడని, నాకు హై టెన్షన్ వైర్లు తగిలినా ఎలా బ్రతికానో నాకు తెలియదని, ఆ ఆంజనేయస్వామి వారే నన్ను బ్రతికించారని చెప్పుకొచ్చారు. ఈ విధంగా ప్రతి ఏడాది ఆంజనేయస్వామి దర్శనానికి పవన్ కళ్యాణ్ వస్తూ ఉంటారు.. ఈ తరుణంలోనే జనవరి మూడవ తేదీన ఆయన కొండగట్టుకు రావడంతో  వేలాదిమంది జనాలు, అభిమానులు పవన్ కళ్యాణ్ ని చూడడానికి ఎగబడి పోయారు.. దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ కు తెలంగాణ, ఆంధ్ర అనే తేడా లేకుండా  అభిమానుల ఆదరణలు ఎక్కడైనా ఉంటాయని అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: