ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలపై త్వరలోనే వేటు పడబోతుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.. ఒకవేళ వీరందరిపై వేటు పడితే మాత్రం రాష్ట్రంలో ఓ మోస్తారుగా ఎన్నికల కోలాహలం వచ్చినట్టే అని చెప్పుకోవచ్చు.. అయితే ఉప ఎన్నిక అంటే సీఎం రేవంత్ రెడ్డి కాస్త భయపడుతున్నారని తాజాగా కడియం శ్రీహరి మాటలు వింటే అర్థమవుతుంది.. పైకి గంభీరంగా మాట్లాడుతున్నా ఉప ఎన్నిక విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వెనకడుగు వేస్తున్నారని కడియం శ్రీహరి చెప్పకనే చెప్పారు. అయితే తాజాగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి రేవంత్ తో జరిగినటువంటి చర్చలో కాసేపు మాట్లాడారు.
అయితే తాను స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, కాంగ్రెస్ తరపున అసెంబ్లీలో అడుగు పెడతానని కడియం ప్రతిపాదనను రేవంత్ తోసిపుచ్చారని సమాచారం.. కేవలం కడియం శ్రీహరి కాకుండా ఈ సీన్ ఇతర ఎమ్మెల్యేలు కూడా ఫేస్ చేశారనే టాక్ వినబడుతోంది.. ఒకవేళ ఉప ఎన్నికలకు వెళ్తే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో అని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన చెందినట్లు సమాచారం. ఒకవేళ ఈ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఈ నియోజకవర్గాల్లో తప్పకుండా కేసీఆర్ రంగంలోకి దిగి ప్రచారం చేస్తారని, ఒకవేళ ఎదురు దెబ్బ తగిలితే కాంగ్రెస్ పరిస్థితి దారుణం అయిపోతుందని రేవంత్ రెడ్డి ఆలోచన చేసినట్టు సమాచారం.
అందుకే ఈ ఎమ్మెల్యేలను రాజీనామా చేయకుండా ఆపుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా అసెంబ్లీ లాబీలో మీడియాతో జరిగిన చిట్ చాట్ సందర్భంగా కడియం శ్రీహరి రేవంత్ భయపడుతున్న విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు. నేను రాజీనామా చేస్తానంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దంటున్నాడని, ఒకవేళ రాజీనామా చేస్తే కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతారని రేవంత్ రెడ్డి భయపడి రాజీనామా చేయనివ్వలేదని చెప్పకనే చెప్పేశారు. మరి చూడాలి వీరిపై చట్టపరంగా వేటు పడి ఉప ఎన్నికలు వస్తాయా.. లేదా.. అనేది ముందు ముందు తెలుస్తుంది.