రాయ‌ల‌సీమ‌లో వైసీపీకి బిగ్ షాక్‌.. బిగ్ వికెట్ డౌన్‌...!

RAMAKRISHNA S.S.
- ( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ ) . . .

అనంతపురం జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ స్థాపన నుంచి క్రియాశీలకంగా ఉంటూ, రాష్ట్ర స్థాయిలో వైఎస్సార్‌సీపీ వాణిని వినిపించిన కీలక నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ నియాజ్ అహ్మద్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మంచి పట్టున్న నాయకుడు ఇలా ఒక్కసారిగా పార్టీ వీడటం స్థానిక వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆదివారం షేక్ నియాజ్ అహ్మద్ తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకోనున్నారు. కేవలం రాజీనామా చేయడమే కాకుండా, తన బలమేంటో నిరూపించేలా వేల మంది అనుచరులతో కలిసి అనంతపురం నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ అనంతరం భారీ బహిరంగ సభలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.


వైసీపీకి ఎందుకు దూరం అయ్యారు ?
గత కొంతకాలంగా అనంతపురం వైసీపీలో అంతర్గత విభేదాలు నడుస్తున్నట్లు సమాచారం. ప్రాధాన్యత తగ్గడం: పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచినా, ఇటీవల స్థానిక నాయకత్వ పోకడలు, ప్రాధాన్యత తగ్గడంపై నియాజ్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అధికార ప్రతినిధిగా పార్టీ వాదనను బలంగా వినిపించినా, క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు భరోసా కల్పించడంలో పార్టీ విఫలమవుతోందనే అభిప్రాయాన్ని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం.


అనంతపురం అర్బన్‌లో మారుతున్న సమీకరణాలు :
నియాజ్ అహ్మద్ చేరికతో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ మరింత బలోపేతం కానుంది. ముఖ్యంగా మైనారిటీ ఓటు బ్యాంకులో నియాజ్ కు మంచి పట్టు ఉండటం టీడీపీకి కలిసొచ్చే అంశం. నియోజకవర్గంలో వైసీపీని బలహీనపరిచే దిశగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. నియాజ్ వంటి బలమైన నేతను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా వైసీపీ క్యాడర్‌ను కోలుకోలేని దెబ్బ తీశారు. అనంతపురం జిల్లాలో వైసీపీకి ఇది కోలుకోలేని దెబ్బ. రాష్ట్ర అధికార ప్రతినిధి హోదాలో ఉన్న నాయకుడే పార్టీని వీడటం ఆ పార్టీ ఆత్మరక్షణలో పడిందనడానికి నిదర్శనం. నియాజ్ అహ్మద్ టీడీపీలో చేరిన తర్వాత అక్కడ వైసీపీ నుంచి మరికొంత మంది ద్వితీయ శ్రేణి నాయకులు బయటకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: