కవిత గంజిలో ఈగేనా..నెత్తి,నోరు కొట్టుకున్నా కేసీఆర్ పట్టించుకోవట్లేదా?

Pandrala Sravanthi
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇంతటి స్థాయికి వచ్చింది అంటే దానికి ప్రధాన కారకుడు కేసీఆర్.. ఆ పార్టీలో ఆయన చెప్పిందే వేదం చేసిందే శాసనం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఈ పార్టీ క్రియాశీలకంగా పనిచేసి రాష్ట్రాన్ని సాధించింది.. ఆ తర్వాత  రాష్ట్రంలో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చింది.. ఇదే సమయంలో కేసీఆర్ ఏది చెబితే అదే వారి నాయకత్వం వినేవారు. ఎన్నో పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని డెవలప్ చేసినటువంటి కేసీఆర్ కిందిస్థాయి నాయకుల వల్ల చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నారు.. అంతేకాదు ఎక్కువగా కుటుంబ రాజకీయం పెరిగిపోయిందని ప్రజల్లో చులకనా భావం ఏర్పడింది.. దీంతో మూడవ దఫా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చారు. ఇక ఎప్పుడైతే ఈ పార్టీ ఓటమి చెందిందో అప్పటినుంచి పార్టీలో చీలికలు ఏర్పడ్డాయి.


 కవితను పార్టీ నుంచి దూరం పెట్టారు. దీంతో ఆమె బీఆర్ఎస్ పార్టీపై తిరుగుబాటు రాగం మొదలుపెట్టింది. ముఖ్యంగా తన తండ్రి కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తుతూ హరీష్ రావు కేటీఆర్ లను కిందికి దించుతూ మాట్లాడింది. మా నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నాయని వీళ్లు పార్టీని ముంచుదామని చూస్తున్నారని కేసీఆర్ కు చెప్పుకొస్తున్నది. అయితే ఇదే విషయంపై కేసీఆర్ అస్సలు స్పందించలేదు.. కనీసం కవిత మాటలకు కానీ కౌంటర్ కూడా ఇవ్వలేదు.. అంతే కాదు తన పని తాను చేసుకుంటూ పార్టీలో ఉండే నాయకులు ఎలాంటి పనులు చేయాలో ప్లాన్లు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలాంటి ఈ తరుణంలో కేసీఆర్ అసలు కవిత మాటలు పట్టించుకోవటం లేదని కొన్ని సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. తాజాగా నీళ్ల పంపకాల విషయంలో తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నీళ్ల విషయంలో కేసీఆర్ కు చాలా అవగాహన ఉంది.


 దీనిపై కేసీఆర్ స్వయంగా వెళ్లి వాస్తవాలను ప్రజలకు వివరిస్తే బాగుంటుంది. కానీ ఈ బాధ్యతను హరీష్ రావుకు అప్పజెప్పడంతో  కవిత మరింత గరం అవుతోంది.  ఆయన వల్ల నష్టమే వస్తుంది తప్ప లాభం ఉండదని, హరీష్ రావు చెబితే జనాలు పట్టించుకోరని హెచ్చరికలు జారీ చేసింది. హరీష్ రావును పక్కన పెడితేనే బీఆర్ఎస్ పార్టీ బతుకుతుందని కవిత ఎప్పటినుంచో చెప్పుకోస్తోంది. అతన్ని అందలం ఎక్కిస్తే బీఆర్ఎస్ పార్టీని దేవుడు కూడా కాపాడలేరని ఆమె హెచ్చరించినా గానీ కేసీఆర్ ఆమె మాటలు పట్టించుకోవడం లేదు. నాకు కవిత కంటే హరీషే ముఖ్యం అనే విధంగా ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తోంది.. దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ కవితను గంజిలో ఈగలాగా తీసివేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఆయన కవిత మాటలను అస్సలు  పట్టించుకోవడం లేదని ప్రస్తుత వ్యవహారం చూస్తే అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: