గత కొద్ది రోజులుగా భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. ఓవైపు స్నేహపూర్వకంగా ఉన్నట్టే ఉండి మరోవైపు అధికంగా టారిఫ్స్ విధిస్తూ భారతదేశాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశానికి వార్నింగ్ ఇచ్చారు. రష్యా చమురు విషయంలో భారత్ సహకరించకపోతే భారత్ పై సుంకాలను పెంచుతామని హెచ్చరించారు.. రష్యా చమురు విషయంలో భారత్ మాకు సహకరించకపోతే మేము భారత్ పై సుంకాలను మరింత పెంచవచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అంతేకాకుండా వారు ప్రాథమికంగా నన్ను సంతోషపెట్టాలనుకున్నారు. ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి. ఆయన మంచివాడు నేను సంతోషంగా లేనని ఆయనకు తెలుసు. నన్ను సంతోష పెట్టడం ముఖ్యం.
ఇప్పటికే ఇండియన్ ప్రొడక్ట్స్ పై 50% టారిఫ్స్ విధించాము. మాకు సహకరించకపోతే మరింత సుంకాలను పెంచగలము అంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ గత ఏడాది ఆగస్టులో ఇండియా పై 50% సుంకాలను పెంచారు. మాస్కోతో న్యూఢిల్లీ సంబంధాలపై తీవ్ర విమర్శలు చేస్తున్న ట్రంప్ విధించిన 50% సుంకాలని భారతదేశం ఇప్పటికే ఎదుర్కొంటుంది. రష్యా ముడిచమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను బలోపెతం చేస్తుందని ఆయన భారతదేశంపై ఆరోపణలు చేశారు. రష్యా ఉక్రేయిన్ యుద్ధంపై ట్రంప్ కి ఉన్న ప్రగాఢ ఆసక్తి రహస్యం ఏమీ కాదు. రష్యా చమురు కొనుగోళ్లపై భారతదేశంపై భారీ సుంకాలు విధిస్తూనే ఏకకాలంలో మాస్కో మరియు కీవ్ మధ్య మధ్యవర్తిగా తనను తాను నిలబెట్టుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు.ఆయన పుతిన్ తో పలు దఫాలుగా చర్చలు జరిపారు.
ఆయనను అలస్కాకి కూడా ఆహ్వానించారు. అయినప్పటికీ ఏవి అర్థమెంతమైన ఫలితాలను ఇవ్వలేదు. అంతేకాకుండా ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీతో కూడా చాలా సార్లు చర్చలు జరిపారు. కానీ ఆ సంభాషణలు కూడా శాంతికి సంబంధించి ఎటువంటి నిర్దిష్ట మార్గాన్ని చూపలేదు. ఇక కొన్ని నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ రష్యా చమురు కొనడం ఆపేస్తామని తనకు హామీ ఇచ్చారని ట్రంప్ చెప్పుకొచ్చారు. దీనిని మాస్కో పై ఒత్తిడి పెంచే దిశగా ఒక పెద్ద అడుగు అని అభివర్ణించారు. అయితే ట్రంప్ మరియు మోదీ మధ్య అలాంటి సంభాషణ జరగలేదని భారతదేశం ట్రంప్ వ్యాఖ్యల్ని కొట్టిపారేసింది. అయితే తాజాగా ట్రంప్ మరోసారి ఇండియన్ ప్రొడక్ట్స్ పై టారీఫ్స్ స్ పెంచుతానని వార్నింగ్ ఇవ్వడంతో మోడీ ట్రంప్ వ్యాఖ్యల పట్ల తలొగ్గుతారా..అమెరికా చెప్పిన మాటలకు కట్టుబడతారా అనేది తెలియాల్సి ఉందిm