శాసన మండలిలో కవిత కన్నీళ్లు.. ఇవే నా చివరి మాటలంటూ.?

Pandrala Sravanthi
కేసీఆర్ కూతురుగా రాజకీయాల్లోకి వచ్చిన కవిత తెలంగాణ జాగృతి పేరుతో చాలా పాపులర్ అయింది. ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక బతుకమ్మ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. అయితే అలాంటి కవిత గత కొద్దిరోజుల నుండి బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తూ చివరికి బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయింది. అయితే పార్టీ తనని సస్పెండ్ చేశాక ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవి తనకెందుకు అని రాజీనామా చేసింది. ఈ నేపథ్యంలోనే తన రాజీనామాని యాక్సెప్ట్ చేయాలంటూ శాసన మండలికి వచ్చి కొన్ని ఎమోషనల్ మాటలు కూడా మాట్లాడింది.ఈ నేపథ్యంలోనే ఇదే నా చివరి ప్రసంగం అంటూ శాసన మండలిలో కన్నీళ్లు పెట్టుకుంటూ కవిత మాట్లాడిన మాటలు ప్రస్తుతం మీడియాలో వైరల్ గా మారాయి. 


మరి ఇంతకీ కవిత ఏం మాట్లాడింది అనేది చూస్తే.. నాకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టిన బీఆర్ఎస్ పార్టీకి,నాకు ఓటు వేసి గెలిపించిన ఎంపిటిసి, జడ్పిటిసి లకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.కానీ నేను ఈ ఎమ్మెల్సీ పదవిలో కొనసాగడానికి బిఆర్ఎస్ పార్టీ నుండి నాకు ఎన్నో కట్టుబాట్లు పెట్టారు. అందుకే ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేశాక ఆ పార్టీ నుండి వచ్చిన పదవి ఎందుకని నేను రాజీనామా చేస్తున్నాను. నేను గతంలో ఇండిపెండెంట్గా జాగృతి సంస్థను స్థాపించాను. ఆ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో ఉన్న గ్యాప్ ని ఫుల్ ఫిల్ చేశాను. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలోకి మహిళ లోకాన్ని తీసుకురావడానికి కృషి చేశాను.. బీఆర్ఎస్ పార్టీలో జరిగే అవినీతిని ప్రశ్నించినందుకే నన్ను తొక్కేయాలని చూసారు. నాకు ఎన్నో కట్టుబాట్లు పెట్టారు. అందుకే ఆ పార్టీలో ఉండలేక బయటికి వచ్చేసాను.


బీఆర్ఎస్ హయంలో పూర్తిగా అవినీతి జరిగింది. అమరవీరుల స్తూపం మొదలు కలెక్టరేట్ల వరకు ప్రతి ఒక్క దాంట్లో అవినీతి జరిగింది. అవినీతిని ప్రశ్నించినందుకే నాపై పగ పెంచుకొని పార్టీ నుండి బహిష్కరించారు. బీఆర్ఎస్ పార్టీ తనని ఘోరంగా అవమానించింది. నేతలు చేసే అవినీతిపై అధిష్టానానికి చెప్పినా ఫలితం లేకుండా పోయింది. తనని అరెస్టు చేసిన సమయంలో కూడా పార్టీ నాకు అండగా నిలబడలేదు. నాపై ముందు నుండే కుట్రలు జరిగాయి. నన్ను తొక్కేయాలని చూసారు. కానీ ప్రజల ముందు నవ్వుతూ కనిపించాను..అంటూ బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు కవిత మరో షాకింగ్ విషయం కూడా బయటపెట్టింది. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చడానికి తాను ఒప్పుకోలేదని, బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు ఎలాంటి గౌరవం లేదని,వారిని పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చారు.


అంతే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో గౌరవం లేని ఉద్యమకారులందరినీ తన జాగృతి పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని, జాగృతి రాజకీయ పార్టీగా మారుతుందని, వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని, తనది ఆస్తుల పంచాయతీ కాదు ఆత్మగౌరవ పంచాయితీ అని, మహిళల హక్కుల కోసం తనని  దీవించాలి అంటూ కవిత షాకింగ్ కామెంట్లు చేసింది.ఇక కవిత శాసన మండలి లో చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం సృష్టించాయి. చాలా రోజుల నుండి కవిత కొత్త పార్టీ పెట్టబోతుందనే చర్చలకు ఈ రోజుతో క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఎన్నికల్లో కవిత పోటీ చేస్తానని చెప్పడంతో కేసీఆర్ కి గట్టి షాక్ తగిలింది.మరి శాసనమండలిలో కవిత చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ గానీ, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని స్పందిస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: