స్లీపర్ బస్సులకు కేంద్ర బిగ్ షాక్..?
ఈ విషయం పైన జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒక కీలకమైన ప్రకటన వెల్లడించారు. ఇకమీదట స్లీపర్ కోచ్ బస్సులను కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి ఆటోమొబైల్ కంపెనీలు మాత్రమే తయారు చేయవలసి ఉంటుందంటూ తెలియజేశారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్లీపర్ కోచ్ బస్సులు కచ్చితంగా భద్రత ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని వాటిని పాటించాలని, బస్సులో అన్ని పరికరాలను కూడా అందుబాటులో ఉంచి ప్రయాణికులకు సమకూర్చాలంటూ నితిన్ గడ్కరీ ఆదేశాలను జారీ చేశారు. ముఖ్యంగా బస్సులలో అగ్ని ప్రమాదాలను గుర్తించే వ్యవస్థ, అత్యవసర లైటింగ్, డ్రైవర్ నిద్రమత్తు ఇండికేటర్లను ప్రతి స్లీపర్ బస్సులలో కూడా అమర్చేల చూడాలని హెచ్చరించారు.
ఎమర్జెన్సీ ఎగ్జిట్ ను ప్రతి ఒక్కరు గుర్తించే విధంగా వాటిని మార్కింగ్ చేయాలని అద్దాలను పగలగొట్టడానికి అవసరమైన పరికరాలను ప్రతి సీటుకు కూడా అమర్చాలని ఇవన్నీ కూడా కచ్చితంగా పాటించాల్సి ఉంటుందంటూ కేంద్రమంత్రి తెలిపారు. బస్సుకు సంబంధించి అనుమతుల విషయంలో సర్టిఫైడ్ అనుమతి ఇచ్చే సమయంలో ఏవైనా తప్పులు జరిగితే మాత్రం రాష్ట్ర అధికారుల పైన కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. బస్సులలో మండే స్వభావం కలిగిన వస్తువులను ఎవరూ కూడా తరలించడానికి అనుమతులు లేవని, ఒకవేళ అటువంటి వాటిని బస్సు యజమాన్యులు తరలిస్తే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనుమతులకు మించి సీట్లను అమర్చకూడదని తెలియజేశారు. బస్సు నిర్మాణానికి ఏఐఎస్ -052 బస్ బాడీ కోడ్ కీలకమైనదని తెలియజేశారు.