ప్రేమ పేరుతో మహిళా ఐఏఎస్ ని వేధించిన కోమటిరెడ్డి.. ఇంత విషమిచ్చి చంపండి అంటూ.!

Pandrala Sravanthi
దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ ఒక పార్టీ అధికారంలో ఉంది అంటే ప్రతిపక్ష నేతలు వారిపై ఏదో ఒక విధంగా పుకార్లు సృష్టిస్తూ విషం చల్లుతూనే ఉంటారు. అలా తాజాగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ పార్టీపై పలు ఆరోపణలు చేశారు. అలాగే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే రీసెంట్గా మహిళా ఐఏఎస్ లను వేధిస్తున్నారు అనే అంశం ఎంత వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు.ముఖ్యంగా నల్గొండకు చెందిన ఐఏఎస్ అధికారిణిని మంత్రి ప్రేమ పేరుతో వేధిస్తున్నారనే ప్రచారం మెయిన్ మీడియాలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడమే కాకుండా రాజకీయాల్లో దుమారం సృష్టించింది.


 ఇదే అదునుగా చేసుకున్న బీఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని వైరల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీపై నేతలపై విరుచుకుపడ్డారు. అయితే తాజాగా ఇలాంటి పుకార్లపై కోమటిరెడ్డి ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ఇప్పటికే నా కొడుకు చనిపోవడంతో సగం చచ్చిపోయాను. ఇంకా ఇలాంటి పుకార్లు నామీద సృష్టించి వేధించకండి. ఇంత విషమిచ్చి చంపండి.కానీ ఇలాంటి పుకార్లు నాపై క్రియేట్ చేయకండి. మీడియా రేటింగ్స్ కోసం పోటీపడి ఇలా మహిళా అధికారుల పై విష ప్రచారం చేయకండి. ఈ మధ్యకాలంలో ఇలాంటి పుకార్లు ఎక్కువైపోయాయి.24 గంటలు పని చేసే రేవంత్ రెడ్డి కూడా ఎవరో మహిళతో వెళ్తున్నారని ఫేక్ ప్రచారం చేశారు.


మహిళా అధికారులను, కుటుంబాలను ఇబ్బంది పెట్టేలా మీడియా రాతలు రాయకూడదు. ఆ టార్చర్ వల్లే మహిళా ఐఏఎస్ అధికారిణిలని ట్రాన్స్ఫర్ చేస్తున్నారని ప్రచారం జరిగింది.కానీ నల్గొండ జిల్లాలో మాత్రమే కాకుండా చాలా జిల్లాలలో ఈ మధ్యకాలంలో ఐఏఎస్ ల బదిలీ ప్రక్రియ కొనసాగింది. అసలు కలెక్టర్ల బదిలీలో ఎమ్మెల్యే, ఎంపీల ప్రమేయం ఉండదు. నా మీద కోపం ఉంటే ఇంత విషమిచ్చి చంపండి కానీ ఇలాంటి పుకార్లు పుట్టించి అధికారులకి,నా కుటుంబానికి ఇబ్బందులు తలపెట్టకండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.ప్రస్తుతం ఈయన మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ గా మారాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: