ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ల కంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు కవిత..కేసీఆర్ కూతురుగా రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేసి తండ్రి చాటు బిడ్డగా ఉన్న కవిత ప్రస్తుతం తండ్రికి ఎదురెళ్లి తండ్రికి వ్యతిరేకంగా పార్టీ కూడా పెట్టబోతోంది. 10 సంవత్సరాలు టిఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో లేని గొడవలన్నీ ఎప్పుడైతే అధికారం పోయిందో అప్పుడే స్టార్ట్ అయ్యాయి. అయితే కల్వకుంట్ల ఫ్యామిలీలో ఆస్తి గొడవలో లేక ఆత్మగౌరవ గొడవలో తెలియదు కానీ కవిత కేసీఆర్ ఫ్యామిలీ నుండి వేరుపడి బయటికి వచ్చేసింది. తండ్రి మంచోడే కానీ తండ్రి చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు కాదని చెప్పుకుంటూ బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా మాట్లాడింది. అలా మాట్లాడడంతో పాటు బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేయడంతో ఆమెను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది.
చివరికి తండ్రి పెట్టిన పార్టీ నుండి సస్పెండ్ అవ్వడంతో బాధతో ఆ పార్టీ నుండి సస్పెండ్ చేశాక పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవి ఎందుకని రాజీనామా చేసింది.
అలాగే కొత్త పార్టీ స్థాపిస్తానని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని వ్యక్తిగా వెళ్తున్నాను శక్తిగా తిరిగి వస్తానని భారీ డైలాగులు కూడా కొట్టింది. దాంతో కవిత ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. అయితే అలాంటి కవిత రాజకీయాల్లోకి రాకముందు ఎక్కడ ఉండేది..ఏం చేసేది.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కేసీఆర్ శోభల కూతురే కవిత. మార్చి 13,1978లో పుట్టిన కవిత చదువు మొత్తం హైదరాబాద్ లోనే కొనసాగింది. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం కవిత కుటుంబాన్ని వదిలి అమెరికా వెళ్ళింది. అమెరికాలోని మిస్సిసిప్పి యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ పూర్తి చేసి అక్కడే కొద్ది రోజులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేసింది.
అలా వర్క్ చేసిన సమయంలోనే కవితకు దేవనపల్లి అనిల్ కుమార్ తో పెళ్లి జరిగింది. అనిల్ కుమార్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. అలా పెళ్లయ్యాక మళ్ళీ వీరు అమెరికా వెళ్లారు. అదే సమయంలో కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర సాధన చేస్తూ టిఆర్ఎస్ పార్టీని స్థాపించారు. అలా తండ్రి రాజకీయాల్లో రాణించడంతోపాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేయటం చూసి ఇన్స్పైర్ అయిన కవిత రాజకీయాల మీద ఆసక్తితో ఇండియాకి తిరిగి వచ్చింది. అదే సమయంలో అనిల్ కుమార్ కూడా అమెరికా వదిలి వ్యాపారం కోసం ఇండియా కి వచ్చారు.అలా 2006లో కవిత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టడం కోసం జాగృతి అనే సంస్థని ఏర్పాటు చేసింది.
ఈ సంస్థ ద్వారా బతుకమ్మ వేడుకలను నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో టిఆర్ఎస్ పార్టీ ద్వారా కవిత నిజామాబాద్ లోక్సభ స్థానం నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచింది.ఆ తర్వాత రెండో దఫా ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఘనవిజయం సాధించింది. అదే సమయంలో నిజామాబాద్ నుండి కవిత మళ్ళీ ఎంపీగా పోటీ చేసినప్పటికీ ఓడిపోయింది.కానీ అప్పటికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఆమెకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. కానీ రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ ఆమె సస్పెండ్ చేయడంతో ఆ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. అలా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేసిన కవిత తండ్రి రాజకీయ పార్టీ ద్వారా రాజకీయాలు నేర్చుకొని ప్రస్తుతం తండ్రికే చుక్కలు చూపిస్తోంది.