తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తయిపోయింది. వారు చెప్పిన హామీలు చాలా వరకు నెరవేరుస్తూ ముందుకు వెళుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంటు, ఉచిత బస్సు ప్రయాణం, రుణమాఫీ వంటివి ఎన్నో జరిగాయి. ముందు ముందు కూడా మరికొన్ని పథకాలు తీసుకొచ్చే యోచనలో రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు వెళ్తుంటే కొంతమంది మంత్రులు మాత్రం వారికి నచ్చిన విధంగా చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నారు. ఇందులో ఐదుగురు మంత్రులు ఉన్నట్టు తెలుస్తోంది.. వీరికి సంబంధించిన డేటా ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానానికి కూడా వెళ్లిందని, త్వరలోనే వీరిని తీసివేసి ఆ ప్లేస్ లో వేరే వారిని తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఆ మంత్రులకు సంబంధించినటువంటి వివరాలను కాంగ్రెస్ అధిష్టానం ఇంటిలిజెన్స్ ద్వారా తెప్పించుకున్నట్లు కూడా తెలుస్తోంది. మరి వారు ఏ తప్పులు చేశారు..ఆ మంత్రులు ఎవరు అనేది చూద్దాం..
దక్షిణ తెలంగాణకు చెందినటువంటి ఒక సీనియర్ మంత్రి ఒక మహిళా అధికారితో నడిపినటువంటి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ చూసినా ఆ మంత్రి ఎవరు.. ఆ అధికారి ఎవరు అనే చర్చనే సాగుతోంది. ఈ ఇష్యూ రేవంత్ సర్కార్ కు బ్యాడ్ నేమ్ తెచ్చిపెడుతుందట. ఆ మంత్రి తీరు వల్ల ఇద్దరు మహిళా అధికారుల బదిలీలు కూడా జరిగాయని తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీలో సీనియర్ గా ఉన్నటువంటి ఒక మంత్రి పూర్తి డేటా ఇంటిలిజెన్స్ రిపోర్టు ద్వారా ఢిల్లీకి చేరిపోయిందట. గత అసెంబ్లీ సమావేశాల్లో ఒంటి కాలిపై నిలబడి అంతా తానే నడిపించిన ఈయన ఈ సెషన్ లో మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. దీన్ని బట్టి చూస్తే ఆయనకి ఈసారి ఇబ్బందులు తప్పవని అర్థమవుతుంది. అంతే కాకుండా దక్షిణ తెలంగాణ చెందిన మరో సీనియర్ మంత్రిది కూడా ఈ విధంగానే ఉంది.
అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందు కాంగ్రెస్ లో చేరిన ఆయన పై కూడా వేటుపడుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఉత్తర తెలంగాణకు చెందిన మరో మంత్రి కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారట. అంతా తానై హైదరాబాదులో చక్రం తిప్పుతూ సర్కారుకు తలనొప్పిగా మారారట. అంతే కాదు మహిళా అధికారులు, నేతలతో వింత మాటలు, జోకులు వేస్తూ చర్చకు దారి తీస్తున్నారు. ఇక వీళ్లే కాకుండా ఉత్తర తెలంగాణకు చెందిన మరో సీనియర్ మహిళా మంత్రి కూడా ఈ లిస్టులో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఆమె నోటి దూల రేవంత్ సర్కారుకు ఇబ్బందికర పరిస్థితులు తీసుకువచ్చింది. ఈమెని కూడా ఢిల్లీ అధిష్టానం తీసివేస్తున్నట్టు ఆ లిస్టులో పేరు లిస్టులో ఉన్నట్టు తెలుస్తోంది.