భోగి పండుగ: నిజమైన మార్పు కోసం భోగి మంటలలో వీటిని కాల్చేయండి..?
1). చాలామంది ఇతర జీవితాలతో తమ జీవితాలను పోలుస్తూ అన్ని విషయాలలో వారి కంటే ఉన్నత స్థాయిలో ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు. ఇందులో ఏమాత్రం భిన్నంగా జరిగిన కూడా ఓర్చుకోలేరు. దీంతో మనశ్శాంతికి దూరం అవుతారు. దీనివల్ల ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లుతుంది. అందుకే ఇతరులతో ఎప్పుడు పోల్చుకోవడం మానేయాలి
2). ప్రతిసారి చిన్న చిన్న పనులను వాయిదా వేస్తూ ఉంటారు. ఈ అలవాటు అవకాశాలను మింగేస్తుంది.
3). మనలోని శక్తిని మనమే చిన్నచూపు చూస్తాం.. కొన్నిసార్లు నేను ఏమి చేయలేనంటూ ప్రయత్నానికి ముందే ఓటమిని అంగీకరిస్తాము. కానీ మన మాటలే మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉండనే ఉంటుంది అందుకే మనల్ని మనం తక్కువ చేసుకోవడం వల్ల ఎన్నో అవకాశాలను కోల్పోవాల్సి ఉంటుంది.
4). రేపు ఏం జరుగుతుందో, తెలియని వాటికి భయపడకూడదు. రాని సమస్యలకు పరిష్కారాలు వెతికే క్రమంలోనే మనసు అలసిపోతుంది. దీనివల్ల శక్తి కూడా వృధా అవుతుంది. దీంతో మనసు చాలా గందరగోళానికి గురై ప్రస్తుతం ఉన్న ఆనందాన్ని ఆస్వాదించలేరు. అందుకే ప్రతి ప్రతి ఒక్కరు రేపు ఏం జరుగుతుందనే విషయాన్ని ఆలోచించకూడదు.
5). బంధువులు మన ప్రేమను అభిమానాన్ని వారి అవసరాల కోసం ఉపయోగించుకుంటారు. బంధం పేరుతో భరించలేని బాధనిచ్చేవారు కూడా ఉంటారు. కొంతమంది మనల్ని ఎప్పుడూ చులకనగా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు.అలాంటి బంధాలను వదిలేయాలి.
6). అహంకారం మనల్ని చాలా ఒంటరిని చేస్తుంది అన్ని నాకే తెలుసని అహంకారం ఏమాత్రం మంచిది కాదు.
7). గడిచిన కాలం వెనక్కి రాదు సమయం చాలా విలువైనది. ఇది తెలిసిన వారే విజేతలు అవుతారు. గతంలో సమయాన్ని వృధానే చేసి ఉన్నవారు ఇకమీదట ఇలాంటి తప్పు చేయకూడదు.