ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో ఏదో రకంగా వినిపిస్తోంది. ఈ విధంగా జనాల్లో హైలెట్ అవుతున్నటువంటి కవిత ప్రతిరోజు కొత్త కొత్త విషయాల గురించి మాట్లాడుతూ రాజకీయాన్ని మరింత రసవత్తరంగా మారుస్తోంది. అలాంటి కవిత దేవనపల్లి గురించి తాజాగా ఒక విషయం సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది. ఇంతకీ అది ఏంటయ్యా అంటే.. ఆమె సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎంఎల్ఏ గా పోటీ చేయడం.. ఇప్పటివరకు సిద్దిపేట ని ఏలింది కేసీఆర్ తర్వాత హరీష్ రావు మాత్రమే.. కేసీఆర్ తప్పుకొని అల్లుడు హరీష్ రావుకు ఆ నియోజకవర్గాన్ని అప్పజెప్పిన తర్వాత అక్కడ ఆయన వరుస విజయాలు సాధిస్తూ అద్భుతమైనటువంటి అభివృద్ధిని చేస్తూ వచ్చారు..
అలాంటి నియోజకవర్గంలో కవిత వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. తన బావ హరీష్ రావును ఓడిస్తేనే ఆమెకు తెలంగాణలో వ్యాల్యూ ఉంటుందని, అందుకే ఆమె సిద్దిపేటలో పోటీ చేయాలనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.. అయితే హరీష్ రావుకు సిద్దిపేట అనేది ఒక కంచుకోట.కేసీఆర్ కూడా అక్కడ వరుసగా కొన్నిసార్లు విజయం సాధించారు.. కానీ చివరికి అల్లుడి కోసం ఆ నియోజకవర్గాన్ని వదిలి ఆయన మరో ప్లేస్ కు వెళ్లిపోయారు.. దీంతో తన తండ్రి వదిలిన నియోజకవర్గాన్ని తాను మళ్ళీ చేతుల్లోకి తీసుకోవాలని హరీష్ రావును అక్కడ ఓడించాలనే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.. కవితకు అంత సీన్ లేదు 20 సంవత్సరాలుగా సిద్దిపేట ను ఎంతో డెవలప్ చేశారు హరీష్ రావు.. అక్కడి వాళ్లు ఆయనను ఒక దేవుడిలా కొలుస్తారు. అంతటి ఘనత కలిగిన లీడర్ ను ఓడించడం కవిత వల్ల కాదంటూ కొంతమంది మాట్లాడుతున్నారు.. మరి కొంతమందేమో కవిత ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తేనే బాగుంటుంది అంటూ మాట్లాడుకుంటున్నారు.. కవిత రాబోవు ఎలక్షన్స్ వరకు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది..సిద్దిపేట లో నిజంగానే పోటీ చేస్తుందా అనేది ముందు ముందు తెలుస్తుంది