ఏపీ:పండుగ వేళ ఉద్యోగులకు గుడ్ న్యూస్..ఖాతాలో డబ్బు జమ.. !

Divya
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పండుగ వేళ తాజాగా ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగానే ఉద్యోగుల బకాయిలను విడుదల చేసింది. సంక్రాంతి సమయంలో ఉద్యోగుల బకాయిల పైన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజునా ఉద్యోగులకు అందాల్సిన బకాయిలు కూడా వరుసగా జమ కాబోతున్నాయి. ప్రభుత్వంలోని వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగుల బకాయిలను చెల్లించడానికి నిధులను జమ చేసి విడుదల చేశారు. అలాగే పోలీసులకు రావాల్సిన సరెండర్ లీవులు, డిఎలను కూడా ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలుస్తోంది.


ఉద్యోగుల డిఏ కోసం ఏకంగా  రూ.110 కోట్ల రూపాయలను విడుదల చేయగా, పోలీసులకు సరెండర్ లీవ్ చెల్లించడంతో సుమారు 55,000 మంది లబ్ధి పొందనున్నారు. అలాగే డిఎ, ఏరియర్స్ చెల్లింపుతో సుమారుగా 2.25 లక్షల మంది ఉద్యోగులకు సైతం బెనిఫిట్ రానుంది. అదేవిధంగా 2.70 లక్షల మంది పెన్షనర్ల కూడా లబ్ది పొందనున్నారు. ఈ నిర్ణయాల వల్ల మొత్తం 5.70 లక్షల మందికి ఈ ప్రయోజనం లభించనుంది. ఈ సంక్రాంతి కానుకకు ప్రభుత్వ ఉద్యోగులకు పోలీసులకు సైతం డిఏ, డిఆర్, ఏరియర్స్, సరెండర్ లీవ్లతో పాటుగా కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న బిల్లులను కూడా  జమ చేయబోతున్నట్లు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.



భోగి పండుగ రోజున ఇందుకు సంబంధించి బకాయిలను చెల్లించగా ఈ రోజున ఉద్యోగుల ఖాతాలో నగదు జమ అవుతున్నట్లుగా తెలుస్తోంది. డిఎ, డిఆర్ఎ, ఏరియర్స్ నిమిత్తం జమ చేయడం వల్ల ఒక్కో ఉద్యోగి ఖాతాలో రూ .70 నుంచి 80 వేల రూపాయల వరకు నగదు జమ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పండుగకు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పడంతో అటు ఉద్యోగులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల ఖాతాలలో ఈరోజు సాయంత్రంలోగా అందరి ఖాతాలలో ఈ బకాయిలు జమ కాబోతున్నట్లు అధికారుల సైతం తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: