రూ. 5 వేల గిఫ్ట్ వచ్చిందా.. ఆ లింక్ క్లిక్ చేశారో అంతే..?
అలా ఇప్పుడు తాజాగా ఫోన్ పే పేరుతో జరుగుతున్న ఒక స్కామ్ ఇప్పుడు స్మార్ట్ మొబైల్స్ వినియోగదారులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. సంక్రాంతి పండుగ వేళ వాట్సాప్ గ్రూపులలో ఫోన్ పే పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ అందరికీ రూ.5000 రూపాయలు నగదు పేరుతో ఒక లింకు విపరీతంగా వైరల్ గా మారింది. పండుగ కానుక కింద ఉచితంగా ఫోన్ పే డబ్బులు ఇస్తుందని నమ్మించేలా ఈ మెసేజ్ ఉండడంతో చాలామంది ఇది నిజమేనని నమ్మేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ఇది పూర్తిగా నకిలీ మెసేజ్ అని దీని వెనుక మొబైల్ ని హ్యాక్ చేసి కుట్ర ఉందంటూ సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాట్సప్ లో వచ్చే ఈ లింక్ ని క్లిక్ చేయగానే ఏకంగా అది ఒక వెబ్సైట్ కి వెళ్తుంది. కొన్ని సందర్భాలలో ఈ పేజీ కూడా ఓపెన్ కాకుండా 404 ERROR అని చూపిస్తుంది. అలా చూపించిన మీరు లింకు క్లిక్ చేసిన ఆ వెంటనే మీ మొబైల్ లోకి అదృశ్యంగా మాల్వేర్ ప్రవేశించే ప్రమాదం చాలా ఉందని పోలీసుల సైతం హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీ మొబైల్ లో ఉండే ఫోటోలు , మొబైల్ నెంబర్స్ బ్యాంకింగ్ పాస్వర్డ్ వంటి వాటివి సైబర్ నేరగాళ్లకు చేరుతాయి. అంతేకాకుండా ఈ గిఫ్ట్ పొందాలంటే మరో 10 మందికి , ఐదు గ్రూపులకు షేర్ చేయాలని నిబంధనను కూడా విధిస్తారు. దీంతో తన మిత్రులకు బంధువులకు కూడా ఈ ప్రమాదంలో నెట్టివేస్తారు. అందుకే ఎవరూ కూడా ఇలాంటివి నమ్మకండి అంటూ తెలియచేస్తున్నారు.