ఆదివారం చోల్లంగి అమావాస్య.. ఎట్టి పరిస్థితిలో ఈ పొరపాటులు చేయకండి..?

Divya
జనవరి 18వ తేదీన చొల్లంగి అమావాస్య రాబోతోంది. దీంతో తమ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని ఎలా తొలగించుకోవాలి నర దృష్టి, దోషం నుంచి పిల్లలను ఎలా కాపాడుకోవాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం చొల్లంగి అమావాస్య రోజున కొన్ని చేయకూడని పనులు ఉన్నాయట?వాటి గురించి చూద్దాం.



ముఖ్యంగా సాయంత్రం పూట ఒంటరిగా నిర్మానుష ప్రాంతాలలో ప్రయాణించకూడదు. అలాగే రోడ్ల పైన దిష్టి తీసిన నిమ్మకాయలను, కొబ్బరికాయ, కుంకుమ వాటిని తొక్కకూడదు. ఈ చొల్లంగి అమావాస్య రోజున ఎవరూ కూడా కొత్త దుస్తులు, కొత్త వ్యాపారాలు, గృహప్రవేశాలు, పెళ్లి సంబంధాలను మాట్లాడుకోవడం వంటివి చేయకూడదు. అలాగే ఏ ఒక్కరు కూడా మాంసాహారం కానీ, మద్యం కానీ, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించడం వంటివి చేయకూడదని పండితులు సైతం తెలియజేస్తున్నారు.


పిల్లలకు దృష్టి దోష నివారణ పోవాలి అంటే చొల్లంగి అమావాస్య రోజున రాళ్ల ఉప్పుతో దిష్టి తీసి ఆ ఉప్పుని పసుపు నీటిలో వేసి ఏదైనా పారేటువంటి నీటిలో వేయడం వల్ల చెడు ప్రభావం తొలగిపోతుంది.


ఏదైనా దేవాలయాల దగ్గర స్నానం చేసి పితృదేవతలకు నువ్వులతో తర్పణం చేయడం వల్ల వంశం అభివృద్ధి కలుగుతుంది.


ఇంటికి ఎలాంటి దిష్టి తగలకుండా సాయంత్రం పూట గుమ్మం వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. చొల్లంగి అమావాస్య రోజున మౌనంగా ఉండడం వల్ల వారికి మానసిక శక్తి ప్రశాంతత కూడా పెరుగుతుంది.


చొల్లంగి అమావాస్య రోజున కొంతమంది దేవాలయాలకు వెళ్లాలనుకుంటారు. వారికి ఆంధ్రప్రదేశ్లో కాకినాడ సమీపంలో తుల్యభాగ నదికి సమీపంలో చొల్లంగి  అనే క్షేత్రం కలదు. ఈ అమావాస్య రోజున అక్కడ చాలామంది స్నానం చేసి అక్కడ దేవుడిని దర్శించుకున్నట్లు అయితే సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్మకం. అందుకే చొల్లంగి అమావాస్య రోజున అక్కడికి వేలమంది భక్తులు పుణ్యస్నానాలతో ఆచరిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: