బండ్ల గణేష్: చంద్రబాబు కోసం సంకల్ప యాత్ర.. లేఖ వైరల్..!
పూర్తి వివరాలలోకి వెళితే బండ్ల గణేష్ రాసిన లేఖలో.. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధికి సంకల్పయాత్ర అనే పేరుతో మొదలుపెట్ట..మన నాయకుడు దేశం గర్వించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మీద వేసిన అబాండాలు తొలగిపోవాలని ఆయన చెరసాల నుంచి బయటికి రావాలని , అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప మీద నిలబడి తాను ఈ మొక్కు మొక్కుకున్నానని.. నా గడప నుంచి నీ కొండ దాకా పాదయాత్ర చేసి వస్తానని.. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతి తెలుగు వాడి ప్రార్థనలతో చంద్రబాబు మళ్ళీ అఖండ విజయంతో పూర్వ వైభవాన్ని అందుకున్నారు. తన కేసులన్నీ కూడా కొట్టేశారు. దీంతో నా మనసు కుదిటపడిందని తెలిపారు.
ఈ సమయంలోనే నా మొక్కు గుర్తుకు వచ్చిందని ఇంకా నా గడప నన్ను అడుగుతోంది.మొక్కుబడి తీర్చుకోమని.. శేషాచలం కొండ పిలుస్తోంది అందుకే మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో ఈనెల 19వ తేదీన ఉదయం 9 గంటలకు షాద్నగర్ మా ఇంటి గడప ముందు కొబ్బరికాయ కొట్టి ఈ పాదయాత్రను మొదలు పెడతానని ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో కొండకు చేరి వెంకన్న స్వామి దర్శనం చేసుకోవడం సంకల్పం అంటూ తెలియజేశారు. ఇది రాజకీయ యాత్ర కాదు.. నా మనోవేదన తీర్చిన కోరిక నా మాట ఆలకించిన ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి ఈ మొక్కు చెల్లిస్తున్నానంటూ తెలిపారు.