“వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026” సదస్సులో మెగాస్టార్ చిరంజీవి

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించిన World Economic Forum వార్షిక సదస్సు–2026లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్విట్జర్లాండ్‌లోని Zurich లో ఉన్నారని తెలుసుకున్న ముఖ్యమంత్రి, ఆయన్ని సదస్సుకు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని గౌరవిస్తూ చిరంజీవి గారు సదస్సుకు హాజరై, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై ఆవిష్కరించిన “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ డాక్యుమెంట్ను ప్రత్యక్షంగా వీక్షించారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ అభివృద్ధి దృక్పథాన్ని ప్రతిబింబించిన ఈ ఘట్టం ప్రత్యేకంగా నిలిచింది.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెగాస్టార్ చిరంజీవి గారిని ఘనంగా ఆహ్వానించారు. తమ కుటుంబ సభ్యులతో పాటు మనవళ్లతో కలిసి “మన శంకరవరప్రసాద్ గారు” సినిమాను వీక్షించానని, సినిమాను ఎంతో ఆస్వాదించానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సినిమా అందించిన వినోదం పట్ల ఆయన తన అభినందనలను వ్యక్తిగతంగా చిరంజీవి గారితో పంచుకున్నారు. స్విట్జర్లాండ్‌లో అనుకోకుండా కలుసుకున్న ఈ సదస్సు సందర్భంగా స్నేహపూర్వకంగా కలసి మంచి సమయాన్ని గడిపారు. చిరంజీవి గారు కుటుంబంతో కలిసి వ్యక్తిగత విహారయాత్ర నిమిత్తం స్విట్జర్లాండ్‌కు వెళ్లిన సమయంలోనే ఈ ఆహ్లాదకరమైన సమావేశం మరియు అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడం చోటు చేసుకుంది.


9490520108.. ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మ‌స్య‌లు, ఎమ్మెల్యేల ప‌నితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్ర‌జ‌ల ఇబ్బందులు, అక్క‌డ అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల ప‌రిస్థితులు, రాజ‌కీయ అంశాల‌పై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: