గత కొద్ది రోజులుగా కేసీఆర్ కూతురు కవిత బీఆర్ఎస్ పార్టీపై, బీఆర్ఎస్ నాయకులపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి మనకు తెలిసిందే. సందు దొరికితే చాలు బీఆర్ఎస్ నాయకులను ఒక్కొక్కరిని కడిగిపారేస్తుంది.కేసీఆర్ మినహా మిగిలిన బీఆర్ఎస్ నాయకులు అందర్నీ అంటే ఆమె అన్నయ్య కేటీఆర్ తో సహా అందరిని ఉతికి ఆరేస్తోంది. కేటీఆర్,హరీష్ రావు, సంతోష్ రావు,జగదీశ్ రెడ్డి వంటి ఎంతోమంది బీఆర్ఎస్ నాయకులపై నిప్పులు చెరుగుతూ వారంతా అన్యాయం చేశారు.. అక్రమ ఆస్తులు సంపాదించారంటూ గుట్టు రట్టు చేస్తుంది. మొదట కేటీఆర్ పై మండిపడినప్పటికీ ప్రస్తుతం కేటీఆర్ పై అంతా కోపంగా మాట్లాడడం లేదు. కానీ సమయం దొరికితే చాలు హరీష్ రావు సంతోష్ రావులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతోంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేటీఆర్,హరీష్ రావులను సిట్ విచారణ చేసింది.అలాగే కవితను కూడా సిట్ విచారణ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా గత కొద్ది రోజుల క్రితం కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారని కవిత చేసిన కామెంట్లకు క్లారిటీ ఇచ్చింది.కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యం ఎవరో కాదు సంతోష్ రావే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావు దయ్యం అని,పెద్ద దుర్మార్గుడు అంటూ ఆయనపై విరుచుకుపడింది.
కేసీఆర్ మాత్రమే కాదు కేటీఆర్ పక్కన ఉన్న దయ్యం కూడా సంతోష్ రావేనని, ఉద్యమ నేతకు ఉద్యమకారులను దూరం చేసిన ఏకైక దుర్మార్గుడు సంతోష్ రావేనని, ఉద్యమకారుడు అయినటువంటి గద్దర్ లాంటి ఎంతోమందిని ప్రగతిభవన్ గేటు కూడా దాటకుండా గేటు దగ్గరే ఉండేలా చేసింది సంతోష్ రావే అంటూ కవిత నిప్పులు చెరిగింది. అంతేకాదు ఆయన కి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో శిక్ష పడుతుందని, సంతోష్ రావుకి కూడా అందులో భాగం ఉందని, సంతోష్ రావు రేవంత్ రెడ్డికి గూఢచారి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే కవిత చేసిన కామెంట్లు అన్నీ ఒకెత్తయితే రేవంత్ రెడ్డికి గూఢచారి అని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరింత హీట్ పెంచేశాయి. నిజంగానే సంతోష్ రావు రేవంత్ రెడ్డికి గూఢచారినా.. లేక సంతోష రావు మీద ఉన్న కోపంతో కవిత అలాంటి వ్యాఖ్యలు చేసిందా అనేది తెలియాల్సి ఉంది.