భారత్- యూరప్ ఒప్పందం.. మన దేశంలో వీటి ధరలు తగ్గే ఛాన్స్..?
ఇక ఇండియాలో ధరలు తగ్గేవి:
ఈ ఒప్పందం అమలు అయితే వైన్ దిగుమతి సుంకం 150 శాతం నుంచి 75 శాతానికి తగ్గుతుంది. అలాగే ప్రీమియం వైన్స్ కూడా 20 శాతానికి, మీడియం వైన్స్ పైన 30% వరకు పన్నులు తగ్గుతుంది. దీనివల్ల యూరోపియన్ వైన్స్ ఇండియాలో చాలా చౌకగానే లభిస్తాయి.
స్పిరిట్ 150 శాతం వరకు ఉన్న పన్ను 40 శాతానికి తగ్గుతుంది.
బీరు దిగుమతి సుంకం 110 శాతం నుంచి 50 శాతానికి తగ్గుతుంది. దీనివల్ల యూరోపియన్ బీర్ బ్రాండ్లు కూడా ఇండియాలో ధరలు తగ్గుతాయి.
కూరగాయల నూనెలు, ఆలీవ్ నూనె, ఇతర నూనెలకు ఐదు సంవత్సరాలలో 45% వరకు పూర్తిగా సుంకాలు తొలగించబడతాయి.
బ్రెడ్, పేస్ట్, బిస్కెట్, పాస్తా, చాక్లెట్ వంటి వాటిపైన 50 శాతం వరకు అధిక సుంకాలు తగ్గిపోతాయి.
అలాగే పండ్ల రసాలు, ఆల్కహాల్ లేని బీరు వంటి దిగుమతులు చేసుకుని సుంకాలు 55% వరకు తగ్గించబడతాయి.
కివి, పియర్ వంటి వాటిపైన 33% సుంకం ఉండగా 10 శాతానికి తగ్గుతుంది.
వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు, ఆహార ఎగుమతుల పైన 36% కంటే ఎక్కువ సంకాలను తొలగించబడతాయి.
లగ్జరీ కార్ల పైన 110 శాతం దిగుమతి సుంకాలపై 10% తగ్గించబోతున్నారు. మోడల్స్ బట్టి ధరలు తగ్గే అవకాశం ఉంటాయి. ఎలక్ట్రిక్ వాహనాల పైన కూడా తగ్గించబడతాయి.
మందులు: అన్ని ఉత్పత్తుల పైన 11% సుంకాలు తొలగించబడతాయి.
గొర్రె మాంసం 33% సుంకం రద్దు.. అలాగే ఇతర మాంస ఉత్పత్తుల పైన 110% సుంకాల నుంచి 50% తగ్గించబడతాయి.
ఈ ఒప్పందం ప్రకారం కేవలం యూరప్ వస్తువులే కాకుండా ఇండియా నుంచి యూరప్ కి వెళ్లే వస్తువులకు అక్కడి మార్కెట్లో పెద్దపీట వేయనున్నారు. అలాగే ఐటీ రంగ నిపుణులు యూరప్ దేశానికి వెళ్లి కూడా పనిచేయడానికి వీసా ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు.