జనసేన కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కి సంబంధించిన విషయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. రైల్వే కోడూరు లోని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న ఓ మహిళా ఉద్యోగినిని వాడుకొని వదిలేసాడు అని ఆ మహిళ ఉద్యోగి సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. తనకు పెళ్లి అయినా భర్త దూరంగా ఉంటున్నాడని తెల్సుకొని,తనకి కొడుకు కూడా ఉన్నాడని తెలిసినా కానీ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మొదట కారులో దూరంగా తీసుకెళ్లి రేప్ చేశాడని, అతను చెప్పిన దానికి ఒప్పుకోకపోవడంతో తీవ్రంగా కొట్టేవాడని, ఇంటికి వచ్చి పలుమార్లు కలిసే వాడని,ఆ తర్వాత తన భర్తకి కూడా ఫోన్ చేసి బెదిరించి విడాకులు ఇవ్వాలని చెప్పాడని, ఆ తర్వాత తన కొడుకుని తన భర్త తీసుకువెళ్లాడని తనకి శ్రీధర్ వల్ల ప్రెగ్నెన్సీ కూడా వచ్చిందని,కానీ అబార్షన్ చేయించుకోవాలని టార్చర్ చేశాడు అంటూ ఎన్నో విషయాలు వీడియోలో తెలిపింది.
అంతేకాకుండా తనని పెళ్లి చేసుకుంటానని ఏడాదిన్నర నుండి వాడుకుంటున్నాడని, ఇప్పుడు మాత్రం పెళ్లి చేసుకోను ఏం లేదు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో నీతో నాకు అయ్యేది ఏమీ లేదు నీ దిక్కున్న చోట చెప్పుకోపో అంటూ బెదిరించాడని, తనకు అన్యాయం జరిగిందని,న్యాయం చేయాలంటూ ఆ వీడియోలో తెలిపింది. అయితే తాజాగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కి సంబంధించి మరో వార్త వైరల్ అవుతుంది. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని కూటమి స్థానిక నేత తాతంశెట్టి నాగేంద్ర ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో నాలుగు రోజుల క్రితమే ఆ మహిళా ఉద్యోగికి ఫోన్ చేసి నువ్వు మోసపోయావ్.. ఇంకా అతనే కావాలనుకుంటే నువ్వు మరింత మోసపోతావ్. అతన్ని వదిలేయ్ అని చెప్పినట్టు తెలుస్తుంది.
శ్రీధర్ ఇంట్లో మీ పెళ్లికి ఒప్పుకోవడం లేదని, అతన్ని మర్చిపోవడం మంచిదని, ఇంకా అతనే కావాలని వస్తే ఏమి ప్రయోజనం లేదు అని, ఆ మహిళ ఉద్యోగికి స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా అరవ శ్రీధర్ బెంగళూరులోని తన కొడుకు చదువుకునే కాలేజీలో కొంతమంది అమ్మాయిలని కూడా లోబర్చుకున్నాడని,ఈ విషయం తన కొడుకు చెప్పడంతో నాకు తెలిసింది. దాంతో ఈ విషయం బయటికి రాకుండా నేనే సర్ది చెప్పాను అంటూ ఆ మహిళా ఉద్యోగికి తాతంశెట్టి నాగేంద్ర స్వయంగా చెప్పినట్టు తెలుస్తోంది. అయితే అరవ శ్రీధర్ ని కాపాడడం కోసమే రైల్వే కోడూరు కూటమి స్థానిక నేత తాతంశెట్టి నాగేంద్ర ఆ మహిళా ఉద్యోగినికి సర్ది చెప్పాలని చూసినట్లు తెలుస్తోంది.