రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో అరవ శ్రీధర్ కి సంబంధించిన ఇష్యూనే తెగ వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే వైసిపి అరవ శ్రీధర్ కి సంబంధించిన వాట్సప్ వీడియో కాల్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇందులో నేను బాధితురాలని అంటూ ఆ మహిళా ఉద్యోగిని ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇక ఆ వీడియో రిలీజ్ చేసినప్పుడు అందరూ ఆ ఎమ్మెల్యేనే దూషించారు. కానీ ఆ తర్వాత ఆమె పెట్టిన ప్రెస్ మీట్ ఎమ్మెల్యేకి సింపతీ క్రీయేట్ చేసింది. మరి ఇంతకీ ఆ ప్రెస్ మీట్ లో మహిళా ఉద్యోగి ఏం మాట్లాడింది.. ఎందుకు అరవ శ్రీధర్ కి మద్దతు పెరుగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ని దోషిగా చేస్తూ తాను బాధితురాలని అంటూ మహిళా ఉద్యోగిని మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది. ఆ ప్రెస్ మీట్ లో ఆమె ఏం మాట్లాడిందంటే.. ఎమ్మెల్యే శ్రీధర్ నాకు ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యారు. పరిచయమైన మూడు గంటలకే నా నెంబర్ తీసుకొని నాతో మాట్లాడడం మొదలుపెట్టారు.
నాకు పెళ్లి అయింది అని తెలిసినా నాతో గంటలు గంటలు మాట్లాడేవారు. అలా ఓ రోజు నన్ను రాత్రి వేళలో ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లారు. అయితే ఎమ్మెల్యే కదా ఉదయం బిజీ షెడ్యూల్ ఉంటుందని అనుకొని ఆయనతో వెళ్లాను. కానీ ఆ రాత్రి ఆయన నన్ను బలవంతంగా కారులోనే రేప్ చేశారు. ఓ ఎమ్మెల్యే నుండి ఇలాంటి ప్రవర్తన నేను ఊహించలేదు. నాకు పెళ్లయి కొడుకు ఉన్నాడు అని తెలిసి నీ భర్తకు విడాకులు ఇవ్వు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎన్నోసార్లు మాట ఇచ్చారు ప్రామిస్ చేశారు.దాంతో ఆయన్ని నేను నమ్మాను. ఐ లవ్ యూ చెప్తే తిరిగి లవ్ యు టూ చెప్పాను. ఆయనతో కమిట్ అవ్వడంతో దాదాపు 5 సార్లు ప్రెగ్నెన్సీ అయింది. కానీ 5 సార్లు అబార్షన్ చేయించుకోమని బెదిరించారు.. అంటూ మహిళా ఉద్యోగి ప్రెస్మీట్లో తెలిపింది.కానీ ఎప్పుడైతే ఆ మహిళ ఉద్యోగి ప్రెస్ మీట్ పెట్టిందో ఆ తర్వాత ఎమ్మెల్యేకి సింపతి బాగా పెరిగిపోయింది.చాలామంది ప్రెస్ మీట్ తర్వాత ఆమెను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. పరస్పర అంగీకారంతోనే కలిశారు తిరిగారు.
కానీ మధ్యలో ఏదో విషయంలో తేడా కొట్టి నేను బాధితురాలిని.. నాకు అన్యాయం జరిగింది.. నాకు న్యాయం చేయాలి అంటే కుదురుతుందా.. ఇష్టముండే ఇన్ని రోజులు ఎంజాయ్ చేశారు. అప్పుడు తెలియదా ఇప్పుడు తేడా కొట్టేసరికి బాధితురాలిని అంటున్నావా.. అంటూ మండి పడుతున్నారు. అయితే ఇదే ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే అని 25 కోట్లు మీరు డిమాండ్ చేయడం వల్లే ఆయన మిమ్మల్ని వదిలేసారనే టాక్ వినిపిస్తోంది.నిజమేనా అని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా..అలాంటిదేమీ లేదు నేనే ఎమ్మెల్యే కి ఏడు లక్షల వరకు ఇచ్చాను అని ఆ మహిళా ఉద్యోగి చెప్పడంతో దొరికిపోయింది. ఎమ్మెల్యే పదవిలో ఉన్న వ్యక్తికి ఏడు లక్షలు లెక్కే కాదు. అలాంటిది ఏడు లక్షలు నీ దగ్గర తీసుకున్నారంటే ఎవరు నమ్ముతారు..ఇదంతా నాటకం.. ఎమ్మెల్యే నుండి డబ్బులు గుంజడం కోసమే ఇలా వీడియోలు, ప్రెస్ మీట్ లు పెట్టి ఆయన పరువు తీయాలని చూస్తున్నావు అంటూ మాట్లాడుకుంటున్నారు.ఏది ఏమైనప్పటికీ ప్రెస్ మీట్ తర్వాత మహిళా ఉద్యోగిని పరువు మొత్తం పోయి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కి సింపతి పెరుగుతుంది.