"మహిళా పైలట్" అయితే జరిగేది ఇదే..అజిత్ పవార్ మరణం తర్వాత సంచలనం సృష్టిస్తున్న ట్వీట్.!

Pandrala Sravanthi
 మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణంతో దేశవ్యాప్తంగా ఎంతో మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. విమాన ప్రమాదంలో ఆయన మరణించడంతో ఇప్పటికే ఆయనకు చాలామంది ప్రముఖులు నివాళులు తెలిపారు. అయితే అలాంటి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించక ముందు గతంలో అంటే 2024లో తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఒక ట్వీట్ ఆయన మరణించాక సంచలనం సృష్టిస్తోంది. మహిళా పైలెట్ అయితే జరిగేది ఇదే అంటూ ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ట్వీట్ పెట్టారు.అయితే తాజాగా ఆయన మరణం తర్వాత ఈ ట్వీట్ ట్రెండింగ్ లోకి వచ్చింది.మరి ఇంతకీ అజిత్ పవార్ పెట్టిన ఆ ట్వీట్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. మహారాష్ట్రలోని పూణేలో నిన్న ఉదయం విమాన ప్రమాదం జరిగిన సంగతి మనకు తెలిసిందే.


 ఈ ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి అజిత్ పవార్ కన్నుమూశారు. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలోనే ఒక్కసారిగా కుప్పకూలి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో విమానంలోని అజిత్ పవార్ తో సహా ఐదుగురు మరణించారు. ఇక ఈయన మరణంతో దేశంలోని ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ఇదిలా ఉంటే విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించడంతో గతంలో ఆయన మహిళా పైలట్ గురించి చేసిన ఒక ట్వీట్ వైరల్ అవుతుంది. ఆ ట్వీట్ ఏంటంటే.. విమానం లేదా హెలికాప్టర్ నడిపే పైలెట్ మహిళ అయితే ఆ విమానం చాలా సేఫ్ గా స్మూత్ గా ల్యాండ్ అవుతుంది. ఈ టైంలోనే అర్థం చేసుకోవాలి ఆ విమానం నడిపే పైలెట్ ఓ మహిళ అంటూ ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టి దానికి ఎన్సిపి ఉమెన్ పవర్ అనే యాష్ ట్యాగ్ ని కూడా పెట్టారు. 


దీంతో అజిత్ పవార్ మరణం తర్వాత ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. అయితే ఈయన ఈ ట్వీట్ ని 2024 జనవరి 18న పెట్టారు. రెండేళ్ల తర్వాత ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ఆయన మరణం తర్వాత ట్రెండింగ్లోకి వచ్చింది. అయితే ఆడవాళ్లు అన్నింటిలో ముందుండాలి యాక్టివ్ గా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఆయన ఈ ట్వీట్ పెట్టినట్టు అర్థమవుతుంది. అయితే అజిత్ పవార్ పెట్టిన ట్వీట్ అర్థం చూస్తే.. విమానంగాని, హెలికాప్టర్ గాని నడిపేది మహిళా ఉద్యోగి అయితే ఎలాంటి విపత్కర పరిస్థితిలో అయినా ఆ విమానాన్ని తన చతురతతో,నైపుణ్యంతో సేఫ్గా ల్యాండ్ అయ్యేలా చేస్తుంది అని అర్థం. అయితే మరో విషయం ఏంటంటే.. ఆయన ఎక్కిన విమానం నడిపిన పైలట్ ఓ మహిళా అని తెలుస్తుంది. ఇక అజిత్ పవార్ ఉన్న ఆ విమానాన్ని యువ పైలట్ కెప్టెన్ శాంభవి పాఠక్ నడిపారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: