ఏపీ: నారా లోకేష్ సంచలన నిర్ణయం..16 ఏళ్లు దాటితేనే సోషల్ మీడియా యాక్సెస్..!

Divya
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం చాలా గట్టిగానే ఉన్నది. దీంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ఉపయోగిస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ప్రభావం చిన్నారుల పైన తీవ్రంగా ప్రభావం చూపిస్తోందనే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మంత్రులు ఒక సంచలన నిర్ణయాన్ని తెలియజేశారు.


నిర్ణీత వయసుకు లోబడిన మైనర్లను సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంచాలనే  నిర్ణయం తీసుకున్నారు. అలాగే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ , విద్వేషపూరిత పోస్టులు చేసే వారి పైన కఠినమైన నిర్ణయాలు ఉంటాయని హెచ్చరించారు నారా లోకేష్. ఇటీవల నారా లోకేష్ నేతృత్వంలో మంత్రులతో భేటీ అయిన సమావేశంలో ఈ అంశం పైన విస్తృతంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సమాజంలో చిన్నారుల భద్రత, శాంతి భద్రతల విషయం పైన ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగి ఉండాలని అందుకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రులందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.


ఎవరైనా సరే ఇక మీదట నిర్ణీత వయసు కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ ఇవ్వకూడదని.. మలేషియా, సింగపూర్ ఆస్ట్రేలియా ఇలా మరికొన్ని దేశాలలో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయాలని మంత్రులు సైతం అధికారులకు సూచించారు.. అలాగే ఈ విషయం పైన సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పరిగణంలోకి తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.  మంత్రి నాదేండ్ల మనోహర్ మాట్లాడుతూ.. మై డిజిటల్ ఐడి ద్వారా మలేషియాలో ఈ కేవైసీ అనుసంధానం చేసి 16 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే సోషల్ మీడియా యాక్సెస్ ఇస్తోందని, అలాంటి తరహాలోనే ఏపీ రాష్ట్రంలో కూడా అమలు చేయవచ్చా అనే అంశాన్ని పరిశీలిస్తున్నామంటూ తెలిపారు. సోషల్ మీడియాలో ఎవరైనా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వారికి ఐటి యాక్ట్ సెక్షన్-46 ప్రకారం.. ఆడ్జుడికేటింగ్  ఆఫీసర్ ను నియమించేలా ప్రతిపాదన తీసుకువచ్చారు. డిజిటల్ వేదికలు సమాజానికి మేలు చేసేలా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని మంత్రులు సైతం స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: